వ్యక్తి అనుమానాస్పద మృతి | - | Sakshi
Sakshi News home page

వ్యక్తి అనుమానాస్పద మృతి

Sep 4 2026 2:36 AM | Updated on Sep 4 2026 2:36 AM

వ్యక్తి అనుమానాస్పద మృతి చేప పిల్లలు నాశనంపై ఫిర్యాదు 3 కిలోల గంజాయి స్వాధీనం బెదిరించడం వల్లే ఆత్మహత్య

భీమవరం: భీమవరం వన్‌టౌన్‌ బ్రిడ్జిపేట సమీపంలోని కందికట్లవారి వీధిలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఏలూరి రాజేశ్‌(38) బుధవారం ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి రాత్రి వరకు తిరిగి రాలేదని, గురువారం ఉదయం ఇంటి బయట సిమెంట్‌ రోడ్డుపై మృతి చెంది ఉన్నట్లు మృతుని భార్య శ్రీదేవి ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి సీఐ ఎ.రమేశ్‌ దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

ఉంగుటూరు: కై కరం శివారు లంకమాలపల్లిలో ప్రభుత్వ భూమిలోని నాలుగు ఎకరాల్లో చేపల చెరువు సాగు చేసుకుంటున్న తనపై కక్షగట్టి, స్థానికంగా తనంటే గిట్టనివారితో కలిసి కొందరు తమకు చెందిన సుమారు రూ.2 లక్షల విలువైన చేప పిల్లలను, రూ.15 వేల విలువైన వలలను నాశనం చేశారని కప్పల రణరాజ్‌ చేబ్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుటుంబం నలుగురం కలిసి గత 40 సంవత్సరాలుగా ఈ భూమిలో వరి సాగు చేసుకుంటున్నామని, అయితే ఆ తర్వాత వరి పండని నేపథ్యంలో గత 14 ఏళ్లుగా దీనిని చేపల చెరువుగా మార్చి సాగు చేసుకుంటున్నామని ఫిర్యాదుదారుడు తెలిపారు.

నూజివీడు: మండలంలోని తుక్కులూరులో ఓ వ్యక్తి వద్ద నుంచి దాదాపు 3 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకోవడం సంచలనంగా మారింది. నిరంతరం అందరిలో ఒకడిగా తిరిగే వ్యక్తి పెద్ద ఎత్తున గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్న విషయం తెలిసి గ్రామస్తులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇతనితో పాటు మరో ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారిస్తున్నట్లు సమాచారం. వీరు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రాంతాల్లోని ఒరిస్సా బోర్డర్‌ నుంచి గంజాయిని తీసుకువచ్చి అమ్ముతుండటం గమనార్హం. ఇటీవల కాలంలో తుక్కులూరుతో పాటు పట్టణంలోని ఎమ్మార్‌ అప్పారావు కాలనీలో గంజాయి సేవించే వారి సంఖ్య పెరిగిందని, చీకటి పడితే వీధుల్లోకి వెళ్లలేకపోతున్నామని ఆయా కాలనీ వాసులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు గంజాయి రవాణాకు సంబంధించి సమగ్రంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. గంజాయిని తీసుకొచ్చి అమ్మడం వెనుక ఉన్న వారందరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు వినికిడి. ఈ రాకెట్‌ వివరాలను నేడు మీడియా ముందు వెల్లడించనున్నట్లు సమాచారం.

నూజివీడు: తన కుమార్తెను బెదిరించి, భయపెట్టడం వల్లే బలవన్మరణానికి పాల్పడిందని దుడ్డు రంజిత (18) తల్లి మేరీ గురువారం రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇవి. మేరీ పెద్ద కుమార్తె రంజిత ఇంటర్‌ వరకు చదువుకొని చాక్లెట్‌ కంపెనీలో రోజువారీ పనులకు వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన బండారు చందు ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పడుతుండటంతో ఈ ఏడాది మే 3వ తేదీన రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. దీంతో అప్పటి నుంచి చందుతో పాటు అతని తల్లిదండ్రులు, బాబాయిలు మేరీ కుటుంబంపై కక్ష పెంచుకుని నీకు జీవితం లేకుండా చేస్తామంటూ బెదిరిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 2న కుటుంబ సభ్యులు ఇంటి వద్ద లేని సమయంలో బండారు చందు మేరీ ఇంటి ఆవరణలో నుంచి బయటకు వస్తుండటాన్ని ఆమె చిన్నకుమార్తె మౌనీ చూసింది. కొద్దిసేపటి తరువాత ఇంటిలోకి వెళ్లి చూడగా రంజిత ఫ్యానుకు వేలాడుతూ ఉండటాన్ని చూసి కేకలు వేయగా, చుట్టుపక్కల వారు వచ్చి రంజితను కిందకు దింపి హనుమాన్‌ జంక్షన్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. తన కుమార్తె చనిపోవడానికి బండారు చందు, అతని కుటుంబ సభ్యులే కారణమని వారిని కఠినంగా శిక్షించాలని మేరీ ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు రూరల్‌ ఎస్సై జీ జ్యోతీబసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement