ఖతర్‌లో వైఎస్సార్‌కు ఘన నివాళి | - | Sakshi
Sakshi News home page

ఖతర్‌లో వైఎస్సార్‌కు ఘన నివాళి

Sep 3 2026 8:47 AM | Updated on Sep 3 2026 8:47 AM

ఖతర్‌లో వైఎస్సార్‌కు ఘన నివాళి నిరుద్యోగ యువతకు శిక్షణ డీఎంహెచ్‌ఓగా భారతీ లక్ష్మి బాల్యవివాహం అడ్డగింత జెడ్పీ ఇన్‌చార్జి సీఈఓగా మల్లికార్జునరావు ఏలూరులో ‘ఎపిక్‌’ సందడి

భీమవరం: దివంగత సీఎం వైఎస్సార్‌ 17వ వర్ధంతిని బుధవారం దోహా ఖతర్‌ న్యూసలాటాలో వైఎస్సార్‌సీపీ ఖతర్‌ కన్వీనర్‌ జాఫర్‌ హుస్సేన్‌ ఆధ్వర్యంలో నిర్వహించారు. వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జాఫర్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, రైతు సంక్షేమం వంటి పలు పథకాలతో ప్రజల హృద యాల్లో వైఎస్సార్‌ చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. గల్ఫ్‌ ప్రతినిధులు నల్లి నాగేశ్వరరావు, నేతల జయరాజు, ఖతర్‌ క మిటీ సభ్యులు మనీష్‌ ఆరోన్‌, అబ్దుల్‌ అలీమ్‌ తదితరులు పాల్గొన్నారు.

భీమవరం: ఉమ్మడి పశ్చి మగోదావరి జిల్లాలోని షెడ్యూల్డ్‌ కులాల ని రుద్యోగ యువతకు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్టు ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ ఎం.ముక్కంటి బుధవారం ప్రకటనలో తెలిపారు. అసిస్టెంట్‌ టెక్నీషియన్‌, కిసాన్‌ డ్రోన్‌ ఆపరేటర్‌, ఎలక్ట్రిక్‌ వెహికల్‌ మెయింటెనెన్స్‌ టెక్నీషియన్‌, ఎలక్ట్రీషి యన్‌–స్మార్ట్‌ ఎనర్జీ, సోలార్‌ పీవీ ఇన్‌స్టాలర్‌, ఫార్మా బయోలాజిక్స్‌, వైద్యపరికరాలు, ఏ1 డేటా ఇంజనీరింగ్‌ ఎనలిస్ట్‌, జూనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ వంటి కోర్సుల్లో శిక్షణ ఇస్తామన్నారు. అభ్యర్డులకు ఉచిత భోజన, వసతి కల్పిస్తామన్నారు. అభ్యర్థులు ఈనెల 6వ తేదీలోపు పేర్లు నమోదు చేసుకోవాలని, మరి న్ని వివరాలకు సెల్‌ 9701355337, 97058 63666, 9393527666, 9640294967 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): పశ్చిమగోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిగా డాక్టర్‌ సీహెచ్‌వీ భారతీ లక్ష్మి బుధవారం బాధ్యతలు స్వీకరించా రు. గతంలో జి.గీతాబాయి డీఎంహెచ్‌ఓగా పనిచేసి పదోన్నతిపై బదిలీ కాగా.. ఇన్‌చార్జి డీఎంహెచ్‌ఓగా ఎం.రవిబాబు పనిచేశారు. ఈ క్రమంలో డీఎంహెచ్‌ఓగా భారతీ లక్ష్మి ఇక్కడకు వచ్చారు.

నరసాపురం రూరల్‌: నరసాపురం 6వ వార్డులోని కోనపరెడ్డి వారి వీధిలో బాల్యవివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. బాలిక (14) కుటుంబసభ్యులు వివాహానికి ఏర్పాటు చేస్తున్నారని ఐసీడీఎస్‌ జిల్లా అధికారులకు ఫిర్యాదు అందడంతో స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. ఐసీడీఎస్‌, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది వి వాహాన్ని అడ్డుకునేందుకు వెళ్లగా బాలిక కు టుంబసభ్యులకు, ప్రభుత్వ సిబ్బందికి మధ్య వా గ్వాదం జరిగింది. అనంతరం ప్రభుత్వ సిబ్బంది పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో బాలిక తల్లిదండ్రులపై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాపరిషత్‌ ఇన్‌చార్జి సీఈఓగా జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు సీఈఓగా పనిచేసిన పి.జగదాంబ గత ఆగస్టు 31న ఉద్యోగ విరమణ చేశారు. దీంతో ఖాళీ అయిన సీఈఓ స్థానంలో డీపీఓ మల్లికార్జునరావుకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించడంతో ఆయన బాధ్యతలు చేపట్టారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): నగరంలో బుధవారం ఎపిక్‌ ఫస్ట్‌ సెమిస్టర్‌ చిత్ర నటీనటులు సందడి చేశారు. స్థానిక ఏలూరు ఇంజనీరింగ్‌ కళాశాలకు వచ్చి విద్యార్థులతో ముచ్చటించారు. ఇది మంచి ఫీల్‌ ఉన్న ప్రేమకథా చిత్రమని, యువతకు వినోదం, అనుభూతి పంచుతాయని హీరో ఆనంద్‌ దేవరకొండ అన్నారు. ఈ చిత్రాన్ని ఆ దరించి, మరిన్ని మంచి చిత్రాలు తీసేలా ప్రో త్సహించాలని హీరోయిన్‌ వైష్ణవి చైతన్య కోరారు. కళాశాల ప్రిన్సిపాల్‌ పి.బాలకృష్ణ ప్రసాద్‌, హెచ్‌ఓడీలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement