జనసేన వేడుకలతో ప్రజలకు ఇబ్బందులు | - | Sakshi
Sakshi News home page

జనసేన వేడుకలతో ప్రజలకు ఇబ్బందులు

Sep 3 2026 8:47 AM | Updated on Sep 3 2026 8:47 AM

రోడ్డును బ్లాక్‌ చేసి స్టేజ్‌ ఏర్పాటు

తాడేపల్లిగూడెంలో ట్రాఫిక్‌ సమస్య

తాడేపల్లిగూడెం అర్బన్‌: తాడేపల్లిగూడెంలో జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజు వేడుకలు ప్రజలకు ఇబ్బందులు కలిగించాయి. ఎమ్మెల్యే బొలిశెట్టి ఆధ్వర్యంలో బుధవారం కేఎన్‌ రోడ్డులో స్థానిక ఆర్టీసీ డిపో వద్ద స్టేజ్‌ను ఏర్పాటుచేశారు. రహదారిని బ్లాక్‌ చేసి స్టేజ్‌ను ఏర్పాటు చేయడంతో కేఎన్‌ రోడ్డు వెంబడి రాకపోకలు సాగించే వాహనాలు ఒక వైపు నుంచే వెళ్లాల్సి వచ్చింది. దీంతో ట్రాఫిక్‌ సమస్య తలెత్తగా వాహనచోదకులు ఇబ్బంది పడ్డారు. పట్టణ, ట్రాఫిక్‌ పోలీసులు ట్రాఫిక్‌ను నియంత్రించడం కష్టంగా మారింది. రోడ్డును బ్లాక్‌ చేసి స్టేజ్‌ను ఏర్పాటుచేయడంపై పలువురు బహిరంగంగానే విమర్శలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement