నరసాపురానికి చంద్రబాబు రిక్తహస్తం | - | Sakshi
Sakshi News home page

నరసాపురానికి చంద్రబాబు రిక్తహస్తం

Sep 3 2026 8:47 AM | Updated on Sep 3 2026 8:47 AM

నరసాపురానికి చంద్రబాబు రిక్తహస్తం

నరసాపురం: ముఖ్యమంత్రి నియోజకవర్గ పర్యటనకు వస్తున్నారంటే.. నిధులిస్తారు, అభివృద్ధి పను లు ప్రారంభిస్తారనే ఆశతో ప్రజలుంటారు.. అ యితే సీఎం చంద్రబాబు నరసాపురానికి తన సహజ సిద్ధమైన వెన్నుపోటు పొడిచి వెళ్లారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి అఖండ పుష్కరాలు సమీపిస్తున్న వేళ సీఎం వరాలు ప్రకటిస్తారని ఆశించిన ప్రజలకు నిరాశే ఎదురయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు ఇక్కడి ఎమ్మెల్యే పనితీరు బాగాలేదని ఒప్పుకున్నారని, అయితే నియోజకవర్గం, జిల్లానే కాదు రాష్ట్రం మొత్తంగా పాలనా వ్యవహారం, సంక్షేమం, అభివృద్ధి విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఒప్పుకుంటే బాగుండేదన్నారు. గతంలో జగన్‌ ముఖ్యమంత్రిగా ఉండగా నరసాపురం వచ్చి రూ.3 వేల కోట్లు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు వచ్చి ఒక్క రూపాయి కూడా నిధులివ్వలేదని, కనీసం పుష్కరాల నిధులపై కూడా స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు.

చెప్పిన అబద్ధాలే మళ్లీ మళ్లీ..

కాళీపట్నం జమిందారీ భూముల వివాదం పరిష్కారానికి జగన్‌ ప్రభుత్వం జీఓ ఇచ్చిందని ప్రసాద రాజు అన్నారు. ఆ జీఓ అమలును విస్మరించి, మళ్లీ కొత్తగా పరిష్కారం చూపిస్తానని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. హార్బర్‌ నిర్మాణానికి భూముల్విడం లేదని తమ అసమర్థతను రైతులపై నెట్టారని, గత ప్రభుత్వంలో బియ్యపుతిప్పలో స్థలం సేకరించి హార్బర్‌ నిర్మాణానికి పాలనా అనుమతులు ఇచ్చామని గుర్తు చేశారు. ఆక్వా యూనివర్సిటీని దేశంలో నంబర్‌వన్‌ చేస్తానని సిగ్గులేకుండా చంద్రబాబు అబద్ధాలు చెప్పారని, తమ ప్రభుత్వంలో 2022లోనే రూ.100 కోట్లతో పాలనా అనుమతులు ఇచ్చామని చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయన్నారు. ఆక్వా చెరువులకు రూ 1.50లకు సబ్సిడీపై విద్యుత్‌ను జగన్‌ ప్రభుత్వం ఇస్తే, తాను కొత్తగా ఇస్తున్నట్టు చంద్రబాబు నిండుసభలో అబద్ధాలు చెప్పారన్నారు. అబద్ధాలు చెప్పడం, చంద్రబాబు మంత్రులను పొగడటం, మంత్రులు అధికారులను పొగడటం తప్ప చంద్రబాబు సభల్లో కొత్తదనం ఉండటం లేదన్నారు. మళ్లీ ప్రతి దానికీ జగన్‌ ప్రభుత్వాన్ని నిందించడం అలవాటుగా మారిందన్నారు.

వైఎస్సార్‌సీపీ నరసాపురం పార్లమెంట్‌ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు పీడీ రాజు, పెండ్ర వీరన్న, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బర్రి శ్రీవెంకటరమణ, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పప్పుల రామారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడిద కోటసత్యనా రాయణ, బీసీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి దొంగ మురళీకృష్ణ, మత్స్యకార నేత అండ్రాజు చల్లారావు, సోషల్‌ మీడియా సెల్‌ జిల్లా కన్వీనర్‌ బందన పూర్ణచంద్రరావు, మైనార్టీ సెల్‌ స్టేట్‌ స్పోక్‌ పర్సన్‌ షేక్‌ బులిమస్తాన్‌, బూత్‌ కమిటీల నియోజకవర్గ కన్వీనర్‌ కావలి నాని, జెడ్పీటీసీ సభ్యులు బొక్కా రాధాకృష్ణ, తి రుమాని బాబూజీ పాల్గొన్నారు.

రూపాయి కూడా నిధులివ్వకుండా వెన్నుపోటు

అన్నిరంగాల్లో కూటమి సర్కారు విఫలం

వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ధ్వజం

స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సిద్ధం

స్థానిక సంస్థల ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ భయపడటం లేదని ముదునూరి పేర్కొన్నారు. సర్‌ ప్రోగ్రాం పూర్తయిన తర్వాత ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని మాత్రమే వైఎస్సార్‌సీపీ భావిస్తుందన్నారు. దీనికి కూడా ముఖ్యమంత్రి వక్రభాష్యం చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఎప్పుడైనా స్థానిక సంస్థల ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించారా? అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నిచోట్లా పోటీ చేస్తామని ప్రసాదరాజు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement