లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం వద్ద బుధవారం తెల్లవారుజామున లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. 8లో u
భీమవరం (ఆర్‌ఆర్‌పేట): ఆక్వా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం మోసం చేస్తోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు విమర్శించారు. భీమవరంలో విలేకర్లతో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల హామీలను విస్మరించి, పవర్ ఫ్యాక్టర్ నిబంధనల పేరుతో విద్యుత్ సబ్సిడీని నీరుగారుస్తున్నారని ఆరోపించారు. పాలకొల్లు సభలో మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఆక్వా రైతుందరికీ రూ.1.50 కే సబ్సిడీ విద్యుత్ ఇస్తున్నట్లు ప్రకటించారని, జూన్ నెల 9న జీవో 169 ద్వారా రూ.1.50 విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నామని జీవో ఇచ్చి, మూడు నెలలకే రెండు జీవోలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పవర్ ఫ్యాక్టర్ నిబంధన వల్ల ఏ రైతుకు కూడా సబ్సిడీ వచ్చే అవకాశంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. పవర్ ఫ్యాక్టర్ నిరూపించుకోవాలని రైతులకు చెప్పడం ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉందన్నారు. వైఎస్ జగన్ హయాంలో రూ.3,800 కోట్ల మేర ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ అందించినట్లు తెలిపారు. పెరిగిన ఫీడ్, సీడ్ ధరలను తగ్గించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కంపెనీలు నామమాత్రపు తగ్గింపు చేసినా పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ఫీడ్ ధరలు కిలోకు రూ.16 పెరిగితే కూటమి ప్రభుత్వం నోరు మెదపలేదని, రూ.4 తగ్గిస్తామని ప్రభుత్వం ప్రకటించగా ఫీడ్ కంపెనీలు కేవలం రూ.2 తగ్గించాయని విమర్శించారు. నరసాపురంలో ఆక్వా యూనివర్సిటీని వైఎస్ జగన్ ప్రభుత్వమే ఏర్పాటు చేసిందని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం దీనికి కనీసం రూ. ఒక రూపాయి కూడా కేటాయించలేదని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కృతజ్ఞతల సభలు పెడుతూ రైతులను మోసం చేస్తున్నారని, దీనికి తగిన గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని ఆయన హెచ్చరించారు.


