అథ్లెటిక్స్‌ సెలెక్షన్స్‌ | - | Sakshi
Sakshi News home page

అథ్లెటిక్స్‌ సెలెక్షన్స్‌

Jul 27 2026 2:12 AM | Updated on Jul 27 2026 2:12 AM

అథ్లెటిక్స్‌ సెలెక్షన్స్‌ నేడు పీజీఆర్‌ఎస్‌ శ్రీనివాసా.. గోవిందా.. వేగివాడలో కరోనా కేసు పోప్‌ లియో నుంచి దీవెనలు ఆర్టీసీ కార్గో బుకింగ్‌ ఏజెంట్లుగా అవకాశం

తాడేపల్లిగూడెం (టీఓసీ) : భారతీయ విద్యాభవన్స్‌లో 38వ ఏపీ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ జూనియర్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్‌ 2026 ఎంపిక పోటీ లు జరిగాయి. వీరంపాలెం హైస్కూల్‌కు చెందిన కె.భువనేశ్వరి అండర్‌–16 షాట్‌పుట్‌ విభాగంలో, ఎం.హేమశ్రీ అండర్‌–14లో ట్రయాతలాన్‌ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచారు. వీరు తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. పాఠశాల హెచ్‌ఎం బి.సుకుమార్‌, పీఈటీ బి.ఉమామహేశ్వరి, ఉపాధ్యాయులు వీరిని అభినందించారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)ను సోమవారం భీమవరం కలెక్టరేట్‌తో పాటు డివిజన్‌, మండల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్‌ కూడా నిర్వహిస్తామన్నారు. ప్రజలు నేరుగా వెబ్‌సైట్‌, టోల్‌ఫ్రీ 1100 ద్వారా కూడా అర్జీలు సమర్పించవచ్చని సూచించారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారిని కేంద్రాలకు తీసుకురాకుండా, వారి ప్రతినిధుల ద్వారా అర్జీలు అందజేయవచ్చని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

ద్వారకాతిరుమల : సెలవు దినం కావడంతో ఆదివారం ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్‌ కౌంటర్లు, కల్యాణకట్ట, అనివెట్టి మండపాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపించింది. సాయంత్రం వరకూ రద్దీ కొనసాగింది.

దెందులూరు : పెదవేగి మండలం వేగివాడలో ఓ 24 ఏళ్ల యువకుడికి కరోనా సోకింది. ఈ విషయాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. సదరు యువకుడికి డయాలసిస్‌ చేయించాల్సి ఉన్నందున విజయవాడ తరలించామని వైద్యాధికారులు తెలిపా రు. కరోనా వైరస్‌ తీవ్రతరమైంది కాదని ఫ్లూ మాదిరిగా వచ్చి పోతుందని డీఎంహెచ్‌ఓ శోభ అన్నారు. ప్రజలు ఆందోళన చెందనవసరం లేదని, గర్భిణులు, బాలింతలు, వృద్ధులు, చిన్నారులు అప్రమత్తంగా ఉంటూ వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

దెందులూరు : ఇటలీలో పోప్‌ లియోను ఆది వారం దెందులూరుకు చెందిన ఆర్‌సీఎం ఫాదర్‌ పులిపాటి అనుదీప్‌ కలిశారు. పోప్‌ నుంచి దీవెనలు తీసుకున్నారు. దేశంలో శాంతి ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ప్రార్థనలు చేయాలని కోరినట్టు ఫాదర్‌ అనుదీప్‌ తెలిపారు. తమ సోదరుడు అనుదీప్‌ పోప్‌ లియోను కలవడం అదృష్టం భా విస్తున్నట్టు వైఎస్సార్‌సీపీ నేత, ఎంపీటీసీ పులిపాటి ఆనంద్‌ అన్నారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట) : ఆర్టీసీ కార్గో సర్వీసుకు సంబంధించి ఆథరైజ్డ్‌ పార్సిల్‌ బుకింగ్‌ ఏజెంట్లుగా నియమించడానికి అవకాశం కల్పిస్తున్నామని జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్‌ షబ్నం ప్రకటనలో తెలిపారు. ఏలూరు పరిసర ప్రాంతాలైన వట్లూరు, సత్రంపాడు, శనివారపు పేట, ఆదివారపు పేట తూర్పువీధి, తంగెళ్లమూడి, అలాగే మండవల్లి, పెదపాడు, పెద వేగి, చాటపర్రు, అశోక్‌నగర్‌, నరసింహారావుపేట, ఫైర్‌స్టేషన్‌, మినీ బైపాస్‌, రామకృష్ణా పురం తదితర ప్రాంతాల్లో పార్సిల్‌ బుకింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు ఆర్టీసీ కార్గో ఏటీఎంను సెల్‌ 73311 47263లో సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement