న్యూస్‌రీల్
వ్యాధులతో నష్టాలు తప్పడం లేదు
సాగు కత్తిమీద సామే
● రొయ్య రైతులను కలవరపెడుతున్న కొత్త వైరస్
● ఇప్పటికే మేత ధర పెంపుతో రైతు కుదేలు
● రొయ్యకు గిట్టుబాటు ధర రాని వైనం
మంగళవారం శ్రీ 7 శ్రీ జూలై శ్రీ 2026
ఆకివీడు: రొయ్య రైతులను కొత్త వైరస్ కలవర పెడుతోంది. ఇప్పటికే గిట్టుబాటు ధర రాక, మేత ధరలు పెరిగి ఆక్వా పరిశ్రమ కుదేలు కాగా.. ఇప్పుడు కొత్త వైరస్ ఆందోళన రేకెత్తిస్తోంది. ఆక్వా సాగుతో ఆదాయం పెంచుకుందామని ఆశపడిన రైతులకు నిరాశే మిగులుతోంది. ఇప్పటికే రొయ్యల ధరలు పడిపోయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. మేత ధరలు కంపెనీలు అడ్డంగా పెంచేయడంతో సాగు చేయలేమంటూ రైతులు చేతులెత్తేశారు. తాజాగా రొయ్యలకు వైట్‌గట్ వైరస్ సోకడంతో సాగు దినదిన గండంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లాలో 1.40 లక్షల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు. ఇప్పుడు వైరస్‌లు రైతుల వెన్నుల్లో వణుకు పుట్టిస్తోంది. వ్యాధులతో పాటు విద్యుత్ సబ్సిడీ విషయంలో ప్రభుత్వం మోసం చేయడంతో రైతులు ఘొల్లుమంటున్నారు.
రొయ్య జీర్ణాశయం దెబ్బతీస్తున్న వైట్ గట్
చెరువు నీటిలోని సహజ ఆహారమైన ప్లాంక్టాను, పెల్లెట్ రూపంలో అనుబంధ ఆహారాన్ని రొయ్యలు తీసుకుంటాయి. వీటితో పాటు నీటిలోని వ్యాధికారక క్రిములు, సేంద్రియ పదార్థాలు, ఇతర పదార్థాలు రొయ్యల జీర్ణాశయం పేగులోకి చేరతాయి. పోషణకు సహకరిస్తాయి. పేగులో చేరిన హానికర బ్యాక్టీరియా, నీలి ఆకుపచ్చ శైవలాలు విషపదార్థాల్ని స్రవిస్తాయి. ఈ విషపదార్థాలు ఆహార నాళంలో విబ్రియో బ్యాక్టీరియా అధిక సంఖ్యలో పెరగడానికి, పేగు గోడల కణజాలం క్షీణించేలా చేస్తోంది. దీంతో రొయ్య తెల్లగా మారిపోతుంది. రొయ్య పేగు (గట్) తెలుపు రంగులో కన్పిస్తుంది. రొయ్యలకు వైట్ గట్ వైరస్ సోకడం వల్ల రైతులకు ఆదాయం భారీగా తగ్గిపోతుంది.
ఈ వ్యాధి సోకిన రొయ్యల్లో లూజు సెల్ ఏర్పడుతోంది. మేత తినడం తగ్గించేస్తుంది. మలం తెల్లగా నీటిపై చారలుగా తేలుతోంది. ఈ విధంగా ఉన్న రొయ్య జీర్ణవ్యవస్థ దెబ్బతిందని గుర్తించాలి. కాలేయం పాలిపోయి వాపు వస్తుంది. రొయ్యలు ఆహారాన్ని తీసుకోకపోవడం, చెరువు అంచుల దగ్గర, ఏరియేటర్ల దగ్గర గుంపులుగా చేరతాయి. బరువు తగ్గిపోయి, ఎదుగుదల క్షీణిస్తుంది. నాణ్యతలేని మేత, చెరువు అపరిశుభ్రంగా ఉంచడం, నీటి నాణ్యత లేకపోవడం, ఆక్సిజన్ స్థాయిలు పడిపోవడం, పర్యావరణ, వాతావరణ పరిస్థితులు కారణంగా ఈ వైరస్ వ్యాసిస్తుంది. దీని నివారణకు సరైన మందులు అందుబాటులో లేవు. దీంతో రైతులు వైట్‌గట్ నివారణకు ఇతర మందులు ఉపయోగిస్తున్నా ఫలితం ఉండడం లేదు. నీటి నాణ్యత, మేత యజమాన్యంతో పాటు వ్యాఽధి తీవ్రతను బట్టి తగిన ప్రో బయోటిక్స్, మందులు వాడాల్సి ఉంటుంది.
ప్రతి అర్జీని గడువులోపు పరిష్కరించాలి
ఇటీవల కాలంలో రొయ్యలకు విపరీతంగా వైరస్ సోకి తీవ్ర నష్టాల పాలవుతున్నాం. ఎన్ని మందులు వాడినా నివారణ ఉండడం లేదు. ఆయా కౌంట్‌లలో పట్టేయాల్సి వస్తుంది. వైట్‌గట్ రొయ్య రైతుల పాలిట శాపంగా మారింది. పారుడు వ్యాధిగా పేరుపడ్డ ఈ వైరస్‌తో రొయ్య రైతుకు నష్టం తప్పడం లేదు.
– పూసపాటి రాధాకృష్ణంరాజు, రొయ్య రైతు, సిద్ధాపురం
రొయ్యల సాగు కత్తిమీద సాములా ఉంది. రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. మేత ధరలు పెరగడం, రొయ్యల ధరల పతనంతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతుంటే వైరస్‌లు మరింత దెబ్బతీస్తున్నాయి. భారీ పెట్టుబడులతో రొయ్యల సాగు భారంగా మారింది. డాలర్ల పంటకు దిక్కులేకుండా పోతుంది.
– వేగేశ్న వెంకట రాజు, రొయ్య రైతు, చినకాపవరం


