రైతన్నలు, ప్రజల ఇబ్బందులు తొలగించడానికి వర్షాలు సమృద్ధిగా కురువాలని కోరుతూ ఆచంటలోని ఆచంటేశ్వరునికి గోదావరీ జలాలతో సహస్ర ఘట్టాభిషేకం నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహించిన, గోదావరి నుంచి వెయ్యి కుండలతో తీసుకువచ్చిన జలాలను వేద పండితుల మంత్రోచ్ఛరణలతో ఆచంటేశ్వరునికి జలాభిషేకం చేశారు. జలాభిషేకం తిలకించడానికి భక్తులు భారీగా హజరయ్యారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రంగరాజు, చైనెక్కంటి గణేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
– పెనుగొండ


