వీరవాసరం : భీమవరం, నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం భీమవరం నియోజకవర్గం స్థాయిలో వీరవాసరం మండల కేంద్రం తులసి ఫంక్షన్ హాల్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రత్యేక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై 150 అర్జీలు వచ్చాయని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జేసీ కేఆర్ కల్ప శ్రీ, ఏలూరు జెడ్పీ సీఈఓ పి.జగదాంబ, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.పిచ్చయ్య, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.


