రాధాకృష్ణను అరెస్టు చేయాలి | - | Sakshi
Sakshi News home page

రాధాకృష్ణను అరెస్టు చేయాలి

Apr 12 2026 2:24 AM | Updated on Apr 12 2026 2:24 AM

చింతలపూడి: మహిళల పట్ల అనుచితంగా, అవమానకరంగా వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్‌ రాధాకృష్ణ, యాంకర్‌ వెంకటకృష్ణలను వెంటనే అరెస్ట్‌ చేయాలని చింతలపూడి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి కంభం విజయరాజు డిమాండ్‌ చేశారు. శనివారం చింతలపూడి పోలీస్‌ స్టేషన్‌లో మహిళా విభాగం నేతలతో కలిసి ఆయన ఫిర్యాదు అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉన్నాయని మండిపడ్డారు. మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరంగా మాట్లాడటం కేవలం రాజకీయ విమర్శ కాదని, ఇది సమాజంలో మహిళల గౌరవాన్ని కించపరిచే ప్రమాదకర చర్య అని ధ్వజమెత్తారు. సోషల్‌ మీడియా కార్యకర్తలను టీం బ్యాచ్‌ అంటూ కించపరచడం, వారిపై వ్యక్తిగత దూషణలకు దిగడం అనైతికమని పేర్కొన్నారు. రాధాకష్ణ, వెంకటకష్ణలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యన డిమాండ్‌ చేశారు. ఎంపీపీ డా.బి.రాంబాబు నాయక్‌, పట్టణ అధ్యక్షుడు కొప్పుల నాగేశ్వరరావు, జిల్లా మున్సిపల్‌ విభాగం అధ్యక్షుడు బొడ్డు వెంకటేశ్వరరావు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కనమతరెడ్డి చండీప్రియ, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు త్సల్లాబత్తుల శ్రీనివాసరావు, మున్సిపల్‌ విభాగం కార్యదర్శి ఎ.సుబ్బారావు, ఎస్సీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు ఎస్‌.కాంతారావు, బీసీ విభాగం అధ్యక్షుడు ఎం గురుబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement