బడుగుల ఆశాజ్యోతి ఫూలే | - | Sakshi
Sakshi News home page

బడుగుల ఆశాజ్యోతి ఫూలే

Apr 12 2026 2:24 AM | Updated on Apr 12 2026 2:24 AM

అంతర్‌ జిల్లా నేరస్తుడి అరెస్టు బడుగుల ఆశాజ్యోతి ఫూలే

అంతర్‌ జిల్లా నేరస్తుడి అరెస్టు
చోరీలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా నేరస్తుడిని నరసాపురం పోలీసులు అరెస్టు చేశారు. 108 గ్రాముల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. 8లో u

భీమవరం(ప్రకాశంచౌక్‌): బడుగు బలహీన వర్గాల విద్యా అవకాశాలకు పునాది వేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిరావు ఫూలే అని జిల్లా కలెక్టర్‌ చదలవాడ నాగరాణి అన్నారు. జ్యోతిరావు పూలే 200వ జయంతి వేడుకలను జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా హాజరై, ఫూలే చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘనంగా నివాళులర్పించారు. డిఆర్‌ఓ బి.శివన్నారాయణ రెడ్డి, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఏవీ సూరిబాబు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి ఎన్‌వీ అరుణకుమారి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి డి.పుష్పరాణి, ఎన్టీఆర్‌ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్‌ డా.కీర్తి శ్రవణ్‌ పాల్గొన్నారు. జిల్లాలో జలధార–జలహారతి కార్యక్రమాన్ని సమర్ధంగా అమలు చేసేందుకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణి ఆదేశించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి శనివారం జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాలో జలధార–జల హారతి– సాగునీటి సంఘాల బాధ్యత 100 రోజుల స్పెషల్‌ డ్రైవ్‌ కార్యక్రమం అమలుపై సమీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement