రైలు ఢీకొని వృద్ధుడి మృతి
తణుకు అర్బన్: రైలు ఢీకొట్టి వృద్ధుడు మృతిచెందిన ఘటన తణుకు రైల్వే అవుట్ పోస్టు ప్రాంతంలో శుక్రవారం ఉదయం జరిగింది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. తణుకు మండలం కోనాలకు చెందిన సనమండ్ర గాంధీ(60) కొబ్బరికాయల దింపు కార్మికుడుగా పనిచేసేవాడు. పదేళ్ల క్రితం చెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగలడంతో వైద్యులు కుడి చేయి తొలగించారు. అప్పటి నుంచి కొబ్బరికాయలు కొని, అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం ఇంటి నుంచి బయటకు వచ్చిన గాంధీ తిరిగి ఇంటికి వెళ్లలేదు. శుక్రవారం ఉదయం రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన ఉదంతంతో గుర్తించిన కుటుంబ సభ్యులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యం మత్తులో రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టి మృతిచెందినట్లు రైల్వే ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు.


