ముద్రా రుణమంటూ సైబర్ మోసం
మిర్చికి కొత్త క్రేజ్
వేలేరుపాడు మండలం నడిమిగొమ్ము గ్రామంలో ఓ యువ రైతు సాగు చేసిన రంగురంగుల మిర్చి ఆకట్టుకుంటోంది. మంచి దిగుబడి వచ్చింది. 8లో u
రూ.2.50 లక్షలకు టోకరా
తణుకు అర్బన్: తణుకులో ముద్రా రుణం మంజూరైందని వచ్చిన ఫోన్‌కాల్‌కు ఆశపడి ఓ మహిళ రూ.2.50 లక్షలను సైబర్ నేరగాళ్లకు సమర్పించుకున్న వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తణుకు పాత పోలీస్‌స్టేషన్ వీధిలో సిద్ధార్థ కర్రీ పాయింట్ (పంతులు కర్రీ పాయింట్) ద్వారా ఉపాధి పొందుతున్న మహిళ సూరికుర్చి లక్ష్మికి కొంతకాలం క్రితం వచ్చిన ఫోన్ కాల్‌లో మీకు రూ.5 లక్షలు ముద్ర లోన్ మంజూరైనట్లు సైబర్ నేరగాడు నమ్మించాడు. తాను హైదరాబాద్ బేగంపేటలోని ఆఫీసులో ఉంటానని తన పేరు అరు ణ్‌గా పరిచయం చేసుకున్నాడు. రుణం కావాలంటే ముందుగా ఫీజు, ఇతర రుసుముల కింద రూ.50 వేలు చెల్లించాలని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన లక్ష్మి పలు దఫాలుగా రూ.2.50 లక్షలు ఆన్‌లైన్ పేమెంట్ యాప్‌ల రూపంలో చెల్లించింది. త్వరలో రూ.7.50 లక్షలు ఇస్తామని చెప్పి చివరగా మరో రూ.50 వేలు చెల్లించాలనడంతో ఆమె నిరాకరించింది. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా సైబర్ మోసగాడు లిఫ్ట్ చేయకపోవడంతో బాధితురాలు హైదరాబాద్ వెళ్లినా అక్కడ ఎవరూ సమాధానం చెప్పలేదు. దీంతో తాను మోసపోయినట్టు గ్రహించి ఆదివారం తణుకులో పోలీసులను ఆశ్రయించింది. తాను 20 ఏళ్లుగా కర్రీ పాయింట్ నిర్వహిస్తున్నానని ఎప్పుడూ ఇలా మోసపోలేదని లక్ష్మి కన్నీటి పర్యంతమయ్యారు.


