బకాయిలు విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

బకాయిలు విడుదల చేయాలి

Jan 5 2026 11:35 AM | Updated on Jan 5 2026 11:35 AM

బకాయిలు విడుదల చేయాలి

బకాయిలు విడుదల చేయాలి

బకాయిలు విడుదల చేయాలి నేడు పీజీఆర్‌ఎస్‌

చింతలపూడి: ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల మూడు నెలల జీతాలు, 12 నెలల పీఎఫ్‌ బకాయిలను తక్షణం విడుదల చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు తొర్లపాటి బాబు డిమాండ్‌ చేశారు. బకాయిల విడుదల కోరుతూ ఐదు రోజులుగా కార్మికులు నిరసన తెలియజేస్తున్నా వెంటనే స్పందించకుంటే డీసీహెచ్‌ఎస్‌ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆదివారం స్థానిక ప్రభుత్వాస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. పాత కాంట్రాక్టు ముగిసి కొత్త కాంట్రాక్టర్‌కు బాధ్యతలు అప్పగించే సమయంలో కా ర్మికులకు రావాల్సిన జీతాలను చెల్లించకపోగా, ఆందోళన చేస్తున్నా వైద్యారోగ్య శాఖ అధికారులు స్పందించకపోవడం దారుణమన్నారు. తక్షణమే వీరి జీతాల విషయంలో నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే మంగళవారం నుంచి జిల్లా అధికారుల కార్యాలయం ఎదుట ఆందోళనలకు దిగుతామన్నారు.

వీరవాసరం: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమాన్ని సోమవారం భీ మవరం కలెక్టరేట్‌తో పాటు డివిజనల్‌, మండల, మున్సిపల్‌ కార్యాలయాల్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. అలాగే మీ కోసం కాల్‌ సెంటర్‌ 1100 ద్వారా సమస్యలను తెలియజేయవచ్చన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement