భగవన్నామ స్మరణ శక్తివంతమైంది
ఉంగుటూరు : భగవన్నామ స్మరణచాలా శక్తి వంతమైనదని ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. మంగళవారం గోపినాథపట్నంలో ముక్కోటి ఉత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొట్టు వెంకటేశ్వరరావు, సరస్వతీ కల్యాణ మండపంలో మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. మానవ జన్మ సార్ధకతకు భగవన్నామ స్మరణ ఒకటే మార్గమని చాగంటి అన్నారు. గోవిందా నామం కలియుగంలో ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. అనితర సాధ్యం కాని దానిని భగవన్నామస్మరణ సాధ్యం చేస్తుందని వివరించారు. మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కాకినాడలో గోవులకు స్థలం అందచేశారని చెప్పారు. కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ చాగంటి కోటేశ్వరరావు మూడోసారి గోపినాథపట్నం వచ్చి ప్రవచనం చెప్పడం ఆనందంగా ఉందన్నారు.


