బాడీ బిల్డింగ్‌లో సత్తా చాటిన భానుప్రకాష్
ఈ ఏడాది మార్చిలో ఏలూరుకు చెందిన భానుప్రకాష్ బాడీ బిల్డింగ్‌లో పతకం సాధించాడు. షిర్డీలో జరిగిన సీనియర్, జూనియర్ ఇండియన్ బాడీ బిల్డింగ్, ఫిట్‌నెస్ ఫెడరేషన్ నిర్వహించిన పోటీల్లో 55 కేజీల విభాగంలో బంగారు పతకం సొంతం చేసుకున్నాడు. భానుప్రకాష్ ఏలూరు, భీమవరం, ఆకివీడు, రాజమండ్రి, కడప, శ్రీకాకుళం, చింతలపూడి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో జరిగిన జిల్లా, జోనల్, రాష్ట్ర స్థాయి పోటీల్లో పదుల సంఖ్యలో గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ చేజిక్కించుకున్నాడు. వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో మహిళలు అద్భుత ప్రతిభ, ప్రదర్శించారు. ఏలూరు ఖేలో ఇండియా సెంటర్ బాలికలు 15 పతకాలు సాధించారన్నారు. ఇందులో 10 గోల్డ్‌మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్ ఉన్నాయి


