కర్షకులకు కష్టకాలం | - | Sakshi
Sakshi News home page

కర్షకులకు కష్టకాలం

Dec 27 2025 9:50 AM | Updated on Dec 27 2025 9:50 AM

కర్షక

కర్షకులకు కష్టకాలం

ఈఓ నియామకంపై ఉత్కంఠ

ప్రభుత్వం మెడలు వంచాలి

రొయ్య విలవిల

న్యూస్‌రీల్‌

ఈఓ నియామకంపై ఉత్కంఠ
చినవెంకన్న దేవస్థానం కొత్త ఈఓ నియామకంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుత ఈఓ ఉద్యోగ విరమణతో కొత్త ఈఓ ఎవరొస్తారన్న దానిపై చర్చ జరుగుతోంది. 8లో u

శనివారం శ్రీ 27 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025

సాక్షి, భీమవరం : రబీ నాట్లతో 2025 సంవత్సరాన్ని స్వాగతించిన రైతులకు ప్రారంభంలోనే ఎరువులు చుక్కలు చూపించాయి. 10:26:26 కాంప్లెక్స్‌ ఎరువు బస్తా (50 కేజీలు) రూ.230 పెరగ్గా, 14:35:14 బస్తా రూ.100, 20:20:013 బస్తా రూ.50 వరకు పెరిగాయి. ఎకరాకు రూ.500 వరకు రైతులపై అదనపు భారం పడింది. 2.30 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా 9.25 లక్షల టన్నుల దిగుబడికి తొలుత ఆరు లక్షల టన్నులు మాత్రమే సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు. రైతుల నుంచి నిరసనలు రావడంతో 7 లక్షలకు పెంచారు. మాసూళ్ల సమయంలో అకాల వర్షాలకు తోడు గోనె సంచుల కొరతతో రైతులు ఇబ్బంది పడ్డారు. ఇదే అదనుగా తేమశాతం ఎక్కువగా ఉందని చెప్పి బస్తాకు రూ.400 వరకు దళారులు కోత పెట్టడంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. జిల్లాలో 77 వేల మంది రైతుల నుంచి రూ.1,650 కోట్ల విలువైన 7.17 లక్షల టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. వీరిలో 18 వేల మందికి పైగా రైతులకు సంబంధించి రూ.290 కోట్లు దాదాపు నెలన్నర రోజుల పాటు ధాన్యం సొమ్ములు జమచేయక ఖరీఫ్‌ సాగు పెట్టుబడుల కోసం రైతులు ఇబ్బంది పడాల్సి వచ్చింది.

కలిసిరాని ఖరీఫ్‌

సాగునీటి ఎద్దడి, వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్‌ సాగు ఆలస్యమైంది. యలమంచిలి, పోడూరు, ఆచంట మండలాల్లో నీరందక నారుమడులు బీటలు తీశాయి. జిల్లాలో 2,20 లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌ సాగవగా పంట పాలుపోసుకునే, గింజ గట్టిపడే కీలక దశల్లో మోంథా తుపాను తీవ్ర నష్టం కలిగించింది. స్వర్ణ, సంపద స్వర్ణ సాగుచేసిన పొలాల్లో పంట నేలకొరిగింది. ఎంటీయూ 1318, పీఎల్‌ఏ 1100, తదితర రకాల్లో తాలు గింజలు పెరిగి దిగుబడులు తగ్గిపోయాయి. ఆకివీడు, నరసాపురం, భీమవరం, పెంటపాడు మొగల్తూరు తదితర మండలాల్లోని 25 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్టు అధికారులు తేల్చారు. ఖరీఫ్‌లో ఎకరాకు సగటున 26.25 క్వింటాళ్ల చొప్పున 5.77 లక్షల టన్నుల దిగుబడి రావాల్సి ఉంది. తుపాను ప్రభావంతో సగటున 21 క్వింటాళ్లతో 4.62 లక్షల టన్నులు మాత్రమే వచ్చింది. క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2369 కాగా.. 1.15 లక్షల టన్నుల దిగుబడి తగ్గడంతో రూ 242.43 కోట్ల మేర రైతులు నష్టపోయారు. మూలిగేనక్కపై తాటికాయ పడ్డట్టు మాసూళ్లు సమయంలో దిత్వా తుపాను మరింత నష్టం కలిగించింది. ధాన్యంలో తేమ శాతం ఎక్కువగా ఉందంటూ దళారులు దోపిడీకి తెరలేపారు.

చంద్రబాబు సర్కారు మెడలు వంచి ఓబీసీ రిజర్వేషన్లు సాధించాలని వైఎస్సార్‌సీపీ పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ గుడాల గోపి అన్నారు. 8లో u

జిల్లాలో 1.2 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. 60 శాతం మేర వనామీ సాగవుతుండగా మిగిలిన విస్తీర్ణంలో చేపలు పెంచుతున్నారు. మార్చిలో అమెరికా సుంకాల పెంపును సాకుగా చూపించి కంపెనీలు ఒక్కసారిగా రొయ్య ధరలను అమాంతం తగ్గించేశాయి. కౌంట్‌ను బట్టి కేజీకి రూ.30 నుంచి రూ.70 వరకు కోత పెట్టారు. ఫీడ్‌, ప్రాసెసింగ్‌ ప్లాంట్ల యజమానులు, ఎక్స్‌పోర్టర్స్‌ సిండికేట్‌గా మారి తమ కష్టాన్ని దోచుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. గతంలోని 30 కౌంట్‌ రూ.470–490, 50 కౌంట్‌ రూ.370, 60 కౌంట్‌ రూ.350 కనీస మద్దతు ధర ఉండాలని, మేత ముడిసరుకు ధరలు భారీగా తగ్గిన నేపథ్యంలో ఫీడ్‌ కంపెనీలు మేత ధరలను టన్నుకు రూ.20 వేలకు తగ్గించాలని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఆక్వా రైతు సంఘాలు క్రాప్‌ హాలీడేకు పిలుపునిచ్చాయి. ఈ మేరకు మంత్రి నిమ్మల సొంత నియోజకవర్గమైన పాలకొల్లు నుంచి మొదలైన క్రాప్‌ హాలీడే నిరసన మిగిలిన నియోజకవర్గాలకు పాకింది. పంట విరామం పాటిస్తున్నట్టు చెరువుల వద్ద రైతులు ఫ్లెక్సీలు ఏర్పాటుచేయగా ప్రాన్స్‌ కో–ఆర్డినేషన్‌ కమిటీ కంటి తుడుపు హామీలతో ఉద్యమాన్ని నీరుగార్చింది. ఆక్వాజోన్‌, నాన్‌ ఆక్వాజోన్‌తో నిమిత్తం లేకుండా రైతులందరికి యూనిట్‌ విద్యుత్‌ను రూ.1.50కే అందిస్తామన్న కూటమి ఎన్నికల హామీ ఈ ఏడాది కార్యరూపం దాల్చపోవడం రైతులకు నిరాశనే మిగిల్చింది.

ప్రభుత్వ సహకార లేమికి ప్రతికూల వాతావరణం తోడైంది. దాళ్వా, సార్వా చివరిలో అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. ధాన్యం సేకరణ లక్ష్యాన్ని ప్రభుత్వం కుదించడం దళారీ వ్యవస్థకు గేట్లు తెరిచినట్లైంది. తేమ శాతం పేరిట రైతులకు మద్దతు గగనమైంది. మరోపక్క ఫీడ్‌, సీడ్‌ కంపెనీలు, ఎక్స్‌పోర్టర్స్‌ సిండికేట్‌ దోపిడీని అరికట్టాలని కోరుతూ ఆక్వా రైతులు క్రాప్‌ హాలిడేకు సిద్ధమయ్యారు. వెరసి 2025 సంవత్సరం కర్షకులకు కలిసి రాలేదు.

ప్రతికూల వాతావరణం.. కొరవడిన సహకారం

రబీ ధాన్యం సేకరణ లక్ష్యం కుదించి దళారులకు గేట్లు తెరిచిన ప్రభుత్వం

ఖరీఫ్‌ చివరిలో ముంచేసిన మోంథా

సిండికేట్‌ దోపిడీతో రొయ్య రైతు విలవిల

ఆక్వా క్రాప్‌ హాలిడేకు పిలుపు

జిల్లాలో 2.2 లక్షల ఎకరాల్లో వరి, 1.6 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలుచేసిన ఉచిత

పంటల బీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తివేయడంతో ప్రీమియం భారాన్ని రైతులే మోయాల్సి వచ్చింది. జగన్‌ హయాంలో

ఏ సీజన్‌లో పంట నష్టం వాటిల్లితే అదే సీజన్‌లో

పరిహారం అందించి రైతులను ఆదుకుంటే ఇప్పుడు

ఆ ఊసే ఎత్తడం లేదు. జిల్లాలో 70 వేల మందికి పైగా కౌలు రైతులు ఉండగా అన్నదాత

సుఖీభవ పథకాన్ని వర్తింప చేయక

వారు నష్టపోవాల్సి

వచ్చింది.

కర్షకులకు కష్టకాలం 1
1/3

కర్షకులకు కష్టకాలం

కర్షకులకు కష్టకాలం 2
2/3

కర్షకులకు కష్టకాలం

కర్షకులకు కష్టకాలం 3
3/3

కర్షకులకు కష్టకాలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement