రేపు ఆర్థిక శాఖ మంత్రి సీతారామన్ పర్యటన
నరసాపురం రూరల్: ఈ నెల 28న నరసాపురం మండలం పెదమైనవానిలంకలె కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటిస్తారని, పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా శుక్రవారం పెదమైనవానిలంకలో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ పెదమైనవానిలంకలో సముద్రపు కోత అడ్డుకట్ట పనులను పరిశీలిస్తారని, అనంతరం మన్‌కీ బాత్ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. డిజిటల్ భవన్‌లో ఏర్పాటుచేసిన డ్రోన్, ఏఐ నైపుణ్య శిక్షణ తరగతులు ప్రారంభిస్తారన్నారు. వికసిత్ భారత్.. డిజిటల్ ఇండియాపై విద్యార్థులకు నిర్వహించిన పెయింటింగ్ పోటీలు, వందేమాతరం పాటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.


