సస్యరక్షణ చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

సస్యరక్షణ చేపట్టాలి

Dec 26 2025 9:52 AM | Updated on Dec 26 2025 10:13 AM

సస్యర

సస్యరక్షణ చేపట్టాలి

సస్యరక్షణ చేపట్టాలి 29న పీఎఫ్‌ నిధి ఆప్‌ కే నికత్‌ కనుల పండువగా శ్రీవారి తిరువీధి సేవ

పెనుగొండ : గత కొన్నిరోజులుగా మంచు శాతం అధికంగా ఉండడంతో నారుమడులపై ప్రభావం చూపుతుందని, రైతులు తక్షణం రక్షణ చర్యలు చేపట్టాలని మండల వ్యవసాయాధికారి పి స్పందన సూచించారు. సాగుకు ఆదిలోనే హంసపాదు శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆమె స్పందించి, పలు సూచనలు చేశారు. మంచు తీవ్రంగా ఉన్నందున నారుమడి ఎదుగుదలపై ప్రభావం చూపుతుందని వివరించారు. మంచు ప్రభావం నుంచి బయట పడడానికి 5 సెంట్లు నారుమడికి 4.4 కేజీ 6.25 కేజీ సింగిల్‌ సూఫర్‌ ఫాస్పెట్‌, 1.6 కేజీ పాటాష్‌ ఎరువులు అందించడం ద్వారా నారుమడి ఎదుగులకు ఇబ్బందులు లేకుండా, వేగంగా పెరుగుతుందన్నారు, వాటితో పాటు జింక్‌ సల్ఫేట్‌ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. నారుమడికి పలుచగా తాజా నీరు అందిస్తుండాలన్నారు. అయినా నారుమడి సరైన ఎదుగుదల లేనిచో 17–17–17 ను 10 గ్రాముల నీటికి బూస్టర్‌ మోతాదుగా పిచికారీ చేయాలన్నారు.

రాజమహేంద్రవరం రూరల్‌: స్థానిక ఈపీఎఫ్‌ఓ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో ఈ నెల 29న నిధి ఆప్‌ కే నికట్‌ జిల్లా ఔట్‌రీచ్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అసిస్టెంట్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ కమిషనర్‌ యు.శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి రామచంద్రపురంలోని వీఎస్‌ఎం ఇంజినీరింగ్‌ కళాశాల, కాకినాడ జిల్లాకు వాకలపూడిలోని ప్యారీ షుగర్స్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు సంబంధించి అయినవిల్లి మండలం పోతుకుర్రులోని త్రీ సీజన్స్‌ ఎగ్జిమ్‌ లిమిటెడ్‌లోను, ఏలూరు జిల్లాకు దేవరపల్లి గ్రామంలోని గోపాలపురం రోడ్డులో ఉన్న పరమేశు బయోటెక్‌లోను, పశ్చిమగోదావరి జిల్లాకు పాలకోడేరులోని ఆనంద ఎంటర్‌ప్రైజెస్‌లోను, అల్లూరి సీతారామరాజు జిల్లాకు మారేడుమిల్లి కేజీబీవీ స్కూల్‌లోనూ ఈ కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. అంతర్జాతీయ కార్మికుల ప్రయోజనాలు, కవరేజ్‌ సర్టిఫికెట్‌, ఈపీఎఫ్‌, సభ్యుడు తనిఖీ చేయాల్సిన అంశాలు, 15జి/15హెచ్‌, పన్ను సంబంధిత ఈపీఎఫ్‌ గురించి ఈ సందర్భంగా వివరిస్తారని తెలిపారు. పీఎఫ్‌ సభ్యులు, పింఛనుదార్లు, వివిధ సంస్థలు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలన్నారు. పీఎఫ్‌ అంశాలపై ఈ సందర్భంగా ఫిర్యాదులు సమర్పించవచ్చన్నారు. పింఛనుదారులు డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ కూడా ఈ శిబిరాల్లో అందించవచ్చని శ్రీనివాసరావు తెలిపారు.

ద్వారకాతిరుమల: చిన వెంకన్న దివ్య క్షేత్రంలో గురువారం శ్రీవారి తిరువీధి సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాలను పురస్కరించుకుని నిత్యం ఆలయంలో విశేష కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఉదయం స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన తొళక్క వాహనంపై ఉంచి విశేష పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, గజ, అశ్వ సేవల నడుమ స్వామి వారి వాహనం క్షేత్ర పురవీధుల్లో తిరుగాడింది. ఆ తరువాత స్థానిక ధనుర్మాస మండపంలో శ్రీవారు, అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు చేసి, భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.

సస్యరక్షణ చేపట్టాలి 1
1/2

సస్యరక్షణ చేపట్టాలి

సస్యరక్షణ చేపట్టాలి 2
2/2

సస్యరక్షణ చేపట్టాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement