సౌత్‌జోన్ బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపిక
భీమవరం: కాకినాడ జేఎన్‌టీయూలో ఈనెల 23వ తేదీన జరిగిన బాస్కెట్‌బాల్ సెలక్షన్స్‌లో విష్ణు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థి జె.సుభాష్ రాజు ఎంపికయ్యారని కళాశాల ఫిజికల్ డైరక్టర్ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. చైన్నె ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో ఈనెల 24 నుంచి 28 వరకూ నిర్వహించనున్న సౌత్‌జోన్ బాస్కెట్ బాల్ పోటీల్లో సుభాష్‌రాజు పాల్గొంటాడని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థిని కళాశాల ప్రిన్సిపాల్ ఎం.వేణు, వైస్ ప్రిన్సిపాల్ ఎం.శ్రీలక్ష్మి, అధ్యాపకులు అభినందించారు.
చాట్రాయి: విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో తాటాకిల్లు దగ్ధమైన ఘటన చాట్రాయి మండలంలోని జనార్థనవరంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నడిపింటి రాంబాబు తాటాకింటిలో బుధవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. వంట సామాగ్రి, పిల్లల సర్టిఫికెట్లతోపాటు బంగారం, నగదు, ధాన్యం దగ్ధమవ్వడంతో బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్ల ప్రమాదం చోటుచేసుకుందని, సుమారు రూ.10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు చెబుతున్నారు.
ఏలూరు (టూటౌన్): ఉంగుటూరు మండలం బాదంపూడిలోని దేశీయ జల మత్స్య సంవర్థన శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుటకు ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మత్స్య శాఖ అధికారి బి.రాజ్‌కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపకార వేతనాలు లేకుండా 20 సీట్లు ఉన్నాయని, దరఖాస్తుదారులకు ఈ నెల 31వ తేదీ ఉదయం 11 గంటలకు బాదంపూడిలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. మత్స్య క్షేత్రాలు, రిజర్వాయర్లలో చేపల పెంపకం గురించి బోధనా, ప్రాక్టికల్స్‌తో కూడిన కోర్సు బోధించడం జరుగుందని, శిక్షణానంతరం పరీక్షలు నిర్వహించి, ఉతీర్ణులైన విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేస్తారన్నారు. 5వ తరగతి ఆపైన చదువుకున్న 18 నుంచి 30 సంవత్సరాల లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 95733 37484, 72869 93033, 94923 37469 నంబర్లలో సంప్రదించాలన్నారు.
మండవల్లి: కుక్కను తప్పించబోయి మోటార్‌సైకిల్‌పై వెళుతున్న ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. ముదినేపల్లి మండలం వడాలి గ్రామానికి చెందిన మట్టా ఏడుకొండలు (36) స్క్రాప్ వ్యాపారం చేసుకుని జీవిస్తుంటాడు. తాడేపల్లి సమీపంలోని జగన్నాధపురంలో నివాసముంటున్న భార్యను తీసుకురావడానికి ఈనెల 23వ తేదీన వడాలి నుంచి మోటార్ సైకిల్‌పై మండవల్లి వైపుకు వస్తున్నాడు. కానుకొల్లు జాతీయ రహదారిపై కుక్క అడ్డురావడడంతో తప్పించబోయే క్రమంలో వాహనం అదుపు తప్పి రోడ్డుపై పడిపోయాడు. తీవ్ర గాయాలైన అతడ్ని స్థానికులు 108 వాహనంపై గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి అన్నయ్య సత్యప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సౌత్‌జోన్ బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపిక


