సప్త సూత్రాలతో సుపరిపాలన
కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం (ప్రకాశంచౌక్): నాణ్యత ప్రమాణాలు విధిగా పాటిస్తూ ప్రజలకు సుపరిపాలన అందించాలని అధికారులకు కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్‌లో మంగళవారం అధికారులకు సుపరిపాలనపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎవరు ఓపికతో వింటారో వారు మంచి అధికారిగా పేరు తెచ్చుకుంటారన్నారు. పరిపాలన ఏ స్థాయిలో ఉన్న సమానత్వం చాలా అవసరం అన్నారు. సుపరిపాలన అందించాలంటే సప్త సూత్రాలను విధిగా పాటించాలని కలెక్టర్ అన్నారన్నారు.


