‘చిన్ని చిన్ని మనసులు’కు మరో అవార్డు
వీరవాసరం: కొమ్మిరెడ్డి క్రియేషనన్స్ బ్యానర్‌పై కొమ్మిరెడ్డి శ్రీనివాస్ నిర్మాతగా, రచయిత అడబాల లక్ష్మీనారాయణ దర్శకత్వం వహించిన చిన్ని చిన్ని మనసులు లఘు చిత్రం ప్రత్యేక అవార్డు గెలుచుకుంది. డిసెంబర్ 21న రాజమండ్రిలో జరిగిన అభినయ గోదావరి కళానికేతన్ అంతర్జాతీయ తెలుగు లఘు చిత్రాల పోటీలలో బెస్ట్ అఫ్ టెన్ ఫిల్మ్ అవార్డుతో పాటు, ఉత్తమ సంగీతం అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డులను డైరెక్టర్, కో–డైరెక్టర్ అందుకున్నారు. షార్ట్ ఫిల్మ్ బృందాన్ని సర్పంచ్ గెడ్డం భారతి, వైస్ ఎంపీపీ అడ్డాల శ్రీరామచంద్రమూర్తి, కె.సర్వేశ్వరరావు, గెడ్డం భాస్కరరావు అభినందించారు.
ఏలూరు (టూటౌన్): అగ్రవర్ణాల వేధింపులు, అరాచకాల నుంచి విముక్తి కల్పించాలని కోరుతూ కై కలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం పేరూరుకు పుట్టి శివభాస్కర్ తన కుటుంబ సభ్యులతో కలిసి కలెక్టరేట్ వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. బాధితుడు మాట్లాడుతూ తన 6.64 ఎకరాల భూమి హద్దులను రైతులు బొప్పన రామలింగేశ్వరరావు, అతని అనుచరులు తొలగించి అక్రమంగా ప్రవేశించి చేపల చెరువు త్రవ్వే ప్రయత్నం చేశారని, తన చెరువును వారికి లీజుకి ఇవ్వాలని ఒత్తిడి చేశారని ఆరోపించారు. నిరాకరించడంతో స్థానిక ఎస్సై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. సంబంధిత రైతులతో రాజీ కుదుర్చుకోవాలని బెదిరిస్తున్నారన్నారు.
‘చిన్ని చిన్ని మనసులు’కు మరో అవార్డు


