చర్చిల కూల్చివేత దారుణం
ఆకివీడు: చర్చిలు, పేదల ఇళ్లు కూల్చడమే చంద్రబాబు ప్రభుత్వం పనిగా పెట్టుకుందని, ఇందుకు కారకులైన వారిని ఆ ప్రభువే శిక్షిస్తాడని వైఎస్సార్‌సీపీ ఉండి నియోజకవర్గ ఇన్‌చార్జి పీవీఎల్ నర్సింహరాజు అన్నారు. దుంపగడప శివారు పల్లెపాలెంలో సోమవారం సెమీ క్రిస్మస్ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీఎల్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంలో పేదలకు ఇళ్లు నిర్మిస్తే, చంద్రబాబు పాలనలో పేదల ఇళ్లు కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రానికి మబ్బు పట్టినట్టుగా పాలన ఉందన్నారు. జగన్ పేదలకు సంక్షేమాన్ని అందిస్తే చంద్రబాబు బడాబాబులకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. క్రైస్తవులకు కిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు అంబటి రమేష్, కేశిరెడ్డి మురళీ, మంతెన సునిల్ వర్మ, నగర పంచాయతీ విప్ పడాల శ్రీనివాసరెడ్డి, కిషోర్‌రెడ్డి, కౌన్సిలర్ గేదల అప్పారావు, మాజీ సర్పంచ్ పిన్నమరాజు సూర్యనారాయణరాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు కొట్టు మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు.


