ప్రజా అర్జీలపై ప్రత్యేక దృష్టి
జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి
భీమవరం (ప్రకాశంచౌక్): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో ప్రజలు అందిస్తున్న అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్ కలెక్టర్ టి. రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం క లెక్టరేట్‌లో డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాల అధికారి వై.దోసిరెడ్డి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్.వెంకటేశ్వరరావుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వృద్ధాప్య, ఒంటరి మహిళ, దివ్యాంగ పింఛన్లు మంజూరు చేయాలని, వృద్ధాప్యంలో ఉన్న వారిని పిల్లలు చూడటం లేదని, రేషన్ కార్డుల మంజూరు, డ్రైనేజీ, సరిహద్దు సమస్యలు ఆక్రమణలు తదితర అంశాలపై పలువురు అర్జీలు అందించారు. మొత్తంగా 265 అర్జీలను స్వీకరించారు. ప్రతి అర్జీని ఆడిట్ చేస్తామని, క్షేత్రస్థాయిలో సిబ్బందితో సమన్వయం చేసుకుని అర్జీదారుడికి సంతప్తికరమైన సమాధానాలు ఇవ్వాలని జేసీ అన్నారు. అర్జీలు రీ ఓపెన్ అయితే కారణాలను పిటిషనర్‌కు వివరింఆచలన్నారు. వృద్ధుల సంక్షేమ అప్పిలేట్ ట్రిబ్యునల్ సభ్యుడు మేళం దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.


