
వనితను పరామర్శించిన మాజీ ఎంపీ భరత్
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్ర మాజీ హోం మంత్రి తానేటి వనితను వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ పరామర్శించారు. వనిత మామయ్య తానేటి బాబూరావు ఇటీవల మరణించిన విషయం తెలిసిందే. పాలకొల్లులోని బాబూరావు నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటం వద్ద భరత్ పుష్పాంజలి ఘటించారు. బాబూరావు భార్య జ్యోతమ్మ, పెద్ద కుమారుడు డాక్టర్ శ్రీనివాస్, వనిత దంపతులకు, అలాగే ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
జంగారెడ్డిగూడెం: లక్కవరం గవర్నమెంట్ హాస్పిటల్‌లో కోడె నాగును పట్టుకున్నారు. ఆసుపత్రిలో పామును స్టాఫ్‌నర్సు గమనించి స్నేక్ సేవియర్ సొసైటీకి సమాచారం ఇచ్చారు. సొసైటీకి చెందిన చదలవాడ క్రాంతి ఆసుపత్రికి చేరుకుని ఐదు అడుగులు పొడవు ఉన్న కోడె నాగును పట్టుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడచిపెట్టారు.