
పెద్దింట్లమ్మా.. పాహిమాం
కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మా.. పాహిమాం.. అంటూ భక్తులు ఆర్తితో వేడుకున్నారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సమీప జిల్లాల నుంచి వేలాది భక్తులు అమ్మను దర్శించుకున్నారు. మేకలు, గొర్రెలను వేడి నైవేద్యాలుగా సమర్పించారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. తలనీలాల వద్ద రద్దీ కనిపించింది. భక్తులు కోనేరు స్నానాలు ఆచరించి ప్రదక్షణలు చేశారు. ఆలయ ఈవో మాట్లాడుతూ వివిధ పూజలు, విరాళాల ద్వారా రూ.20,037 ఆదాయం వచ్చిందని తెలిపారు.
పెదవేగి: రాట్నాలమ్మకు భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వేంచేసియున్న శ్రీరాట్నాలమ్మకు ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఈ వారం అమ్మవారికి పూజా రుసుము వలన రూ.44,080, విరాళంపై రూ.10,753, లడ్డూ ప్రసాదంపై రూ.18,000, పులిహోర ప్రసాదంపై రూ.1,380, ఫోటోలు రూ 2,455, మొత్తం రూ.76,668 ఆదాయం లభించిందని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్.సతీష్‌కుమార్ తెలిపారు.
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భారీసంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. పాల పొంగళ్ళశాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామివారి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు. స్వామిని దర్శించుకునే భక్తులు అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొంటే మేలు జరుగుతుందనే విశ్వాసం ఉంది.

పెద్దింట్లమ్మా.. పాహిమాం

పెద్దింట్లమ్మా.. పాహిమాం