
రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలు
భీమవరం: రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలు భీమవరంలో ఆదివారం నిర్వహించారు. ఈ పోటీల్లో క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ మాట్లాడుతూ యువత విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ఖేలో ఇండియాలో భాగంగా విద్యార్థిని ధృతి సమీక్షకు చెక్కు అందజేశారు. ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ ఎన్.సుగుణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఏలూరు రూరల్: ఏలూరు కస్తూర్బా బాలికల పాఠశాల 10వ తరగతి విద్యార్థిని పి.నందిని జాతీయ బాస్కెట్‌బాల్ పోటీలకు ఎంపికై ందని పాఠశాల హెచ్‌ఎం కె.మాధవీలత ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 14 నుంచి 17 వరకూ పిఠాపురంలో జరిగిన బాస్కెట్‌బాల్ పోటీల్లో నందిని జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించి ప్రతిభ చాటిందని గుర్తు చేశారు. ఈ నెల 2 నుంచి 9 వరకూ పంజాబ్ రాష్ట్రం లుథియానాలో జరిగే జాతీయ జూనియర్ బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొంటుందన్నారు.

రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలు