
వైద్య సేవ.. అవినీతి తోవ
మొక్కు తీర్చుకునేందుకు వెళుతూ..
గతంలో పారదర్శకంగా..
న్యూస్‌రీల్
ఉచిత బస్సు.. ప్రయాణం తుస్సు
మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నామని గొప్పలు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం, పలు బస్సు సర్వీసులను రద్దు చేసి ఇక్కట్లకు గురిచేస్తోంది. 8లో u
ఆదివారం శ్రీ 31 శ్రీ ఆగస్టు శ్రీ 2025
సాక్షి, భీమవరం: ఆరోగ్యశ్రీ సేవల్లో నెట్‌వర్క్ ఆస్పత్రులు చేతి వాటం చూపిస్తున్నాయి. ఉచిత వైద్య సేవలకు రోగుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నాయి. ఆస్పత్రుల తీరుపై బాధితుల ఫిర్యాదులతో గతంలో తణుకులోని ఒక ఆస్పత్రికి రూ.3.02 లక్షలు జరిమానా విధించగా తాజాగా భీమవరంలోని ఆస్పత్రిలో డయాలసిస్ సేవలకు ఆటంకం ఏర్పడింది. జిల్లాలో ఆరోగ్యశ్రీ వైద్యసేవలు అందించే ప్రభుత్వ ఆస్పత్రులు 42 ఉండగా ప్రైవేట్ ఆస్పత్రులు 30 వరకు ఉన్నాయి. ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో 22 మల్టీ స్పెషాలిటీ, ఎనిమిది డెంటల్ ఆస్పత్రులు ఉన్నాయి. ఈ పథకం కింద వైద్య సేవ పొందే రోగికి ఉచిత అడ్మిషన్, అవసరమైన వైద్య పరీక్షలు, శస్త్రచికిత్సలతో పాటు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే వరకు మందులు, రూమ్ సదుపాయం, అల్పాహారం, రెండు పూటలా భోజనం, వైద్యసేవలు అందించాలి. డిశ్చార్జ్ సమయంలో రోగికి సరిపడా మందులు ఇచ్చి పంపాలి.
కొరవడిన అజమాయిషీ: వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ఎన్‌టీఆర్ వైద్యసేవగా పేరు మార్చిన కూటమి ప్రభుత్వం పర్యవేక్షణను గాలికొదిలేసింది. బిల్లుల విడుదలలో జాప్యం, అజమాయిషీ కొరవడటంతో నెట్‌వర్క్ ఆస్పత్రుల ఇష్టారాజ్యంగా మారింది. మత్తు ఇచ్చేందుకనో, వైద్యానికి అప్రూవల్ రావడానికి ఆలస్యమవుతుందనో, కొన్ని వైద్య పరీక్షలు బయట చేయించాలనో, మందులు కోసమనో.. రకరకాల కారణాలు చెప్పి రోగుల నుంచి డబ్బులు గుంజుతున్నారు. డెలివరీలకు సైతం సొమ్ములు చెల్లించాలంటున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎందుకొచ్చిన గొడవన్నట్టు చాలామంది రోగులు ఆస్పత్రి యాజమాన్యాలు అడిగినంత సొమ్ములు చెల్లించి అక్కడితో వదిలేస్తున్నారు. కొందరు బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఆస్పత్రి యాజమాన్యాలతో కుమ్మకై ్కన కొందరు సిబ్బంది బాధితులకు నచ్చజెప్పి చాలా వరకు ఫిర్యాదులను వెనక్కి తీసుకునేలా చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. బాధితులు వెనక్కి తగ్గని పక్షంలో ఉన్నతస్థాయి నుంచి సంబంధిత ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటున్నారు.
పదింతల జరిమానాలు
ఉచిత వైద్య సేవ నిబంధనలకు విరుద్ధంగా తమ నుంచి డబ్బులు వసూలు చేస్తే అందుకు పదిరెట్లు ఆస్పత్రి యజమాన్యానికి జరిమానా విధించాలి. ఈ మేరకు ముగ్గురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై తణుకులోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి కొద్దినెలల క్రితం రూ.3.02 లక్షలు జురిమానా విధించారు. వీటిలో ఒక రోగి నుంచి రూ.10 వేలు వసూలు చేయగా అందుకు పది రెట్లుగా రూ.లక్ష, మరో రోగి నుంచి రూ.15,000 వసూలు చేసినందుకు రూ.1.5 లక్షలు, మరో రోగి నుంచి రూ.5,200 వసూలు చేసినందుకు రూ.52,000 జరిమానా విధించారు. తాజాగా భీమవరంలోని ఒక ఆస్పత్రిలో రూ.6800 వసూలు చేయడంతో రూ.68 వేలు జరిమానా విధించారు. రోగులకు ప్రత్యామ్నాయం చూపకుండా అక్కడ అందిస్తున్న డయాలసిస్ సేవలను నిలుపుదల చేశారు. దీంతో డయాలసిస్ రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. రోగుల బంధువులు ఆందోళనకు దిగడంతో కొత్త కేసులు తీసుకోకుండా ప్రస్తుతం డయాలసిస్ పొందుతున్న వారికి సేవలను కొనసాగించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. అక్రమ వసూళ్లపై జిల్లాలోని మరికొన్ని ఆస్పత్రులపైనా ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టుకు ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది.
శ్రీవారికి మొక్కు తీర్చుకునేందుకు వెళుతున్న దంపతులను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొంది. ప్రమాదంలో భర్త దుర్మరణం చెందగా భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. 8లో u
ఆరోగ్యశ్రీ పథకాన్ని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలుచేసింది. కుటుంబానికి రూ. 5 లక్షలు ఉన్న వ్యయ పరిమితిని రూ.25 లక్షలకు పెంచడం ద్వారా పేదల ఆరోగ్యానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరింత భరోసా కల్పించారు. ఈ పథకం కింద అందించే 1,059 చికిత్సల సంఖ్య(ప్రొసీజర్ల)ను 3,257కి పెంచారు. క్యాన్సర్ లాంటి ఖరీదైన జబ్బుల చికిత్సకు పరిమితి లేకుండా అవసరమైన సాయం అందించారు. శస్తచికిత్స అనంతరం రోగి కోలుకునే వరకు జీవనభృతి కోసం వైఎస్సార్ ఆరోగ్య ఆసరా కింద ఆర్థికసాయం అందించేవారు. ఇంటికి వెళ్లిన పది రోజుల తర్వాత ఆసుపత్రికి వచ్చి ఉచితంగా వైద్య సేవలు పొందే వీలు కల్పించారు. అవసరమైన చికిత్సలకు ఏడాది పాటు డాక్టర్ సంప్రదింపులు, వైద్య పరీక్షలు, మందులు కూడా ఉచితంగా ఇచ్చేవారు. అక్రమాలకు తావులేకుండా 14400 టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసే వీలు కల్పించారు. కూటమి పాలనలో ఆరోగ్యశ్రీ పథకం నిర్లక్ష్యం నీడలో కొట్టుమిట్టాడుతోందని రోగులు వాపోతున్నారు. సకాలంలో బిల్లులు విడుదల చేయక సేవలు నిలిపివేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆరోగ్యశ్రీ సేవల్లో అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేసేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని రోగులు కోరుతున్నారు.
ఆరోగ్యశ్రీ సేవల్లో అరకమాలు
నెట్‌వర్క్ ఆస్పత్రుల చేతివాటం
రోగుల నుంచి డబ్బులు వసూలు
గతంలో తణుకులోని ఆస్పత్రికి రూ.3.02 లక్షల జరిమానా
తాజాగా భీమవరంలోని ఆస్పత్రిలో డయాలసిస్ సేవలకు ఆటంకం
వైఎస్సార్‌సీపీ హయాంలో పారదర్శకంగా పథకం అమలు

వైద్య సేవ.. అవినీతి తోవ