
రఘురామకృష్ణరాజు సొంత నిర్ణయం
కలెక్టరేట్ తరలింపు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు సొంత నిర్ణయం మాత్రమే. తన మాట ముఖ్యమంత్రి వింటారనే మొండి వైఖరితో ముందుకు వెళ్తున్నారు. పేదల ఇళ్లు తొలగించిన ప్రాంతంలో ప్రభుత్వ భవనాలు ఎలా నిర్మిస్తారు. మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో కలెక్టరేట్ సాధ్యమా?.
– లంక కృష్ణమూర్తి, ఫార్వర్డ్‌బ్లాక్ జిల్లా కార్యదర్శి
ప్రజల ఆకాంక్షల మేరకు భీమవరంలోనే కలెక్టరేట్ ఏర్పాటుచేయాలి. ఉండి తరలించడంతో ప్రజల ఆకాంక్షలను ధిక్కరించడమే. గత ప్రభుత్వం ఏఎంసీలో స్థలం కేటాయింపు, నిధులు మంజూరు చేసిన తరువాత ఇప్పుడు కొత్తప్రాంతాన్ని ఎంపిక చేయడంలో ఆంతర్యం ఏమిటో ప్రజలకు చెప్పాలి.
– గంటా సుందరకుమార్, దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు
ఇరిగేషన్ భూమిల్లో పేదలు నిర్మించుకున్న ఇళ్లు తొలగించిన అక్కడి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ప్రభుత్వ భవనాలు ఎలా నిర్మిస్తారు. అక్కడ ఇళ్లు తొలగింపుపై కోర్టులో కేసులున్నాయి. ప్రజలను మభ్యపెట్టడానికే కలెక్టరేట్ తరలింపు వ్యవహారం తెరపైకి తెచ్చారు.
– కామన నాగేశ్వరరావు, అడ్వకేట్
కలెక్టరేట్ భీమవరం నుంచి తరలిపోకుండా నిర్వహించే ప్రజా ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. ఏఎంసీ ఆవరణలో కలెక్టరేట్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. జేఏసీని ఏర్పాటు చేసి భీమవరంలో కలెక్టరేట్ ఉండేలా ఉద్యమం చేపట్టాలి.
– మద్దాల సాయికుమార్, కాంగ్రెస్ నాయకుడు

రఘురామకృష్ణరాజు సొంత నిర్ణయం

రఘురామకృష్ణరాజు సొంత నిర్ణయం

రఘురామకృష్ణరాజు సొంత నిర్ణయం