
నరసాపురంలో కలెక్టరేట్‌కు వ్యతిరేకం కాదు
భీమవరం: నరసాపురంలో కలెక్టరేట్ ఏర్పాటుకు తాను వ్యక్తిగతంగా వ్యతిరేకిని కాదని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ అన్నారు. నరసాపురంలో కలెక్టరేట్ ఏర్పాటు చేయాలని ఆ నియోజకవర్గ అఖిలపక్ష నాయకులు ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ఆధ్వర్యంలో మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందచేశారు. భీమవరంలో ఇంతవరకూ పనులు ప్రారంభం కాలేదని ఈ నేపథ్యంలో నరసాపురంలో ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
కలెక్టర్‌కు వినతిపత్రం
భీమవరం (ప్రకాశంచౌక్): నరసాపురంలో జిల్లా కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అఖిల పక్ష నేతలు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా నలుమూలల నుంచి ప్రధాన కార్యాలయాలకు వచ్చే ప్రజలు, ఉద్యోగులకు నర్సాపురం సౌకర్యంగా ఉంటుందన్నారు. పట్టణంలో 50 ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు.