సేవాతత్పరత..సామాజిక బాధ్యత | - | Sakshi
Sakshi News home page

సేవాతత్పరత..సామాజిక బాధ్యత

Aug 24 2025 2:10 PM | Updated on Aug 24 2025 2:10 PM

సేవాత

సేవాతత్పరత..సామాజిక బాధ్యత

డిగ్నిటీ ఆఫ్‌ కై ండ్‌నెస్‌ పెంపొందించేలా..

‘నా’ అనే స్వార్థాన్ని విడిచి.. ‘మన’ అనే దృక్పథాన్ని పెంచేలా ఏలూరు పోలీసులు సేవాతత్పరత చాటుతూ ‘మోడల్‌ పోలీస్‌’గా నిలుస్తున్నారు. మానవత్వ స్ఫూర్తిని పెంపొందిస్తూ సామాజిక బాధ్యతపై అవగాహన పెంచేలా వినూత్న కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. సమాజంలో అభాగ్యులకు ఆపన్నహస్తం అందించేలా జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్‌ కై ండ్‌నెస్‌ వాల్‌, టేక్‌ ఏ బుక్‌.. లీవ్‌ ఏ బుక్‌ కార్యక్రమాలు చేపట్టి ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఏలూరులో ‘మోడల్‌’ పోలీస్‌

కై ండ్‌నెస్‌ వాల్‌, టేక్‌ ఏ బుక్‌ కార్యక్రమాలు

పోలీసుల ఆధ్వర్యంలో పర్యవేక్షణ

పిల్లలకు చిన్నతనం నుంచే సామాజిక పరిస్థితు లపై అవగాహన, బాధ్యత పెంచాలి. ఇదంతా ఇంటి నుంచి ప్రారంభించాలి. దానం చేశామనే ఫీలింగ్‌ మనలో ఉండకుండా, తీసుకున్నామనే ఆలోచన మనసును బాధించకుండా డిగ్నిటీ ఆఫ్‌ కై ండ్‌నెస్‌ ప్రతి ఒక్కరిలో పెంపొందించాలి. కరుణ, దయాగుణం పిల్లల్లో అలవర్చుతూ సంస్కృతి, సంప్రదాయాలను పాటించేలా చూడాలి. దీంతో కక్షలు, ద్వేషాలు, కోపాలు, దాడులు, దౌర్జన్యాలు నిరోధించే అవకాశం ఏర్పడుతుంది.

– కొమ్మి ప్రతాప్‌ శివకిషోర్‌,

ఏలూరు జిల్లా ఎస్పీ

టేక్‌ ఏబుక్‌ ర్యాక్‌

ఏలూరు టౌన్‌ : ఓ వైపు చట్టానికి లోబడి శాంతిభద్రతలను పరిరక్షించడంతో పాటు మరోవైపు సామాజిక బాధ్యతగా ఏలూరు అమీనాపేట పోలీస్‌ పెట్రోల్‌స్టేషన్‌ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన కై ండ్‌నెస్‌ వాల్‌ మన్ననలు పొందుతోంది. ఇంట్లో మనం ఉపయోగించని వస్తువులు చాలా ఉంటాయి. సమాజంలో ఆ వస్తువులు అవసరమైన వారూ ఉంటారు. అయితే వాటిని వారికి ఎలా అందించాలో చాలా మందికి తెలియదు. సా యం చేయాలన్న ఆలోచన ఉన్నా మార్గం లేక వదిలేస్తారు. అలాంటి వారు ఎ లాంటి ఇబ్బంది లేకుండా ఆయా వస్తువులను పోలీసులు ఏర్పాటుచేసిన కై ండ్‌నెస్‌ వాల్‌ అల్మారాలో పెట్టవచ్చు. వాటిని అవసరమైన వారు తీసుకుని వినియోగిస్తారు. ఈ విధానంలో డిగ్నీటీ.. కై ండ్‌నెస్‌.. కేరింగ్‌.. ఒక్కచోటే ఉంటాయి. ఈ ఆలోచనలతో పోలీసులు ఏర్పాటుచేసిన కై ండ్‌నెస్‌ వాల్‌ మన్ననలు పొందుతోంది. పలువురు దుస్తులు, ఆటబొమ్మలు, షూష్‌, చెప్పులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఇలా పలురకాల వస్తువులను ఇక్కడ ఉంచుతున్నారు. వీటిని పిల్లలు, పెద్దలు, కార్మికులు వచ్చి ఆనందంగా తీసుకువెళుతున్నారు. కై ండ్‌నెస్‌ బాస్కెట్స్‌ పేరుతో ఇదే విధానం పలు దేశాల్లో మన్ననలు పొందింది.

టేక్‌ ఏ బుక్‌కు మంచి ఆదరణ

ఏలూరు ఎస్పీ క్యాంపు కార్యాలయం బయట రోడ్డుపైనా, ట్రాఫిక్‌ పార్కులో టేక్‌ ఏ బుక్‌.. లీవ్‌ ఏ బుక్‌ అనే నూతన విధానాన్ని ప్రారంభించారు. జిల్లా జేసీ ధాత్రిరెడ్డి ఆలోచనతో వీటిని ఏర్పాటుచేశారు. పాఠశాలలు, కళాశాలలు పునః ప్రారంభమైన సమయంలో మంచి స్పందన వస్తోంది. చాలామంది విద్యార్థులు పుస్తకాలు ఈ ర్యాక్‌లో పెడితే, అవసరమైన వారు తీసుకుంటున్నారు. ఇప్పటికీ విద్యార్థులు అల్మారాలోని విలువైన పుస్తకాలు తీసుకుని చదివి, వారి వద్ద ఉన్న పుస్తకాలను అక్కడ పెడుతున్నారు. ఈ పుస్తకాల ర్యాక్‌కు విద్యార్థులు, లెక్చరర్స్‌, ఉపాధ్యాయుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

సేవాతత్పరత..సామాజిక బాధ్యత 1
1/2

సేవాతత్పరత..సామాజిక బాధ్యత

సేవాతత్పరత..సామాజిక బాధ్యత 2
2/2

సేవాతత్పరత..సామాజిక బాధ్యత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement