క్షీరారామంలో హైకోర్టు న్యాయమూర్తి పూజలు | - | Sakshi
Sakshi News home page

క్షీరారామంలో హైకోర్టు న్యాయమూర్తి పూజలు

Aug 24 2025 2:08 PM | Updated on Aug 24 2025 2:08 PM

క్షీర

క్షీరారామంలో హైకోర్టు న్యాయమూర్తి పూజలు

క్షీరారామంలో హైకోర్టు న్యాయమూర్తి పూజలు స్ఫూర్తి ప్రదాత టంగుటూరి రోగుల నుంచి ఎలాంటివసూళ్లకూ పాల్పడలేదు హామీల అమలు కోసం పోరాటం

పాలకొల్లు సెంట్రల్‌: పంచారామక్షేత్రం క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయాన్ని హైకోర్టు న్యాయమూర్తి బి.కృష్ణమోహన్‌, వసంత లక్ష్మి దంపతులు సందర్శించారు. శనివారం మధ్యా హ్నం ఆలయానికి విచ్చేసిన జడ్జి కృష్ణమోహన్‌ దంపతులకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. న్యాయమూర్తి దంపతులు ముందుగా గణపతి పూజ చేసి అనంతరం క్షీరారామలింగేశ్వరస్వామి, జనార్దనస్వా మి, లక్ష్మీపార్వతి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ ఈఓ ముచ్చర్ల శ్రీనివాసరావు వారిని స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి చిత్రపటాన్ని అందజేశారు. పట్టణ జడ్జి షేక్‌ జియావుద్దీన్‌, తహసీల్దార్‌ వై.దుర్గాకిషోర్‌, ిసీఐ రజనీకుమార్‌, ఆలయ సూపరింటెండెంట్‌ పసుపులేటి వాసు ఉన్నారు. పాల్గొన్నారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం, పోరాట పటిమ స్ఫూర్తిదాయకమని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో టంగుటూరి జయంతి కార్యక్రమం నిర్వహించారు. టంగుటూరి చిత్రపటానికి కలెక్టర్‌, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రం, ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం టంగుటూరి కృషి మరువలేమని కలెక్టర్‌ అన్నారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి కె.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

భీమవరం(ప్రకాశం చౌక్‌): ఆరోగ్యశ్రీ సేవల కోసం రోగుల నుంచి ఎలాంటి వసూ ళ్లు చేయలేదని భీమవరం వర్మ హాస్పిటల్‌ చైర్మన్‌ డాక్టర్‌ పీఆర్‌కే వర్మ తెలిపారు. శని వారం ఆస్పత్రిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏప్రిల్‌లో ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ నుంచి ఇద్దరు ప్యానెల్‌ డాక్టర్లు వచ్చి ఆస్పత్రిలో రోగులతో మాట్లాడి తాము ఎలాంటి వసూళ్లకు పాల్పడలేదని నిర్ధారించారన్నారు. అయినా ఈనెల 21న సాయంత్రం నుంచి తమ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టు సమాచారం వచ్చిందన్నారు. ఓ డెలివరీ కేసుకు సంబంధించి రెండు కోడ్‌లు పెట్టడంతో రూ.6 వేలు ఫైన్‌ వేశారని, నిబంధనల ప్రకారం రూ.60 వేలు డీడీ తీసి సోమవారం ట్రస్ట్‌కు అందించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. ఆస్పత్రిలో 175 మంది పాత రోగులకు డయాలసిస్‌ సేవలు కొనసాగుతున్నాయన్నారు.

తాడేపల్లిగూడెం (టీఓసీ): కూటమి నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేసే వరకూ పోరాటం కొనసాగిస్తామని పట్టణ భవన నిర్మాణం కార్మిక సంఘం, ఏఐటీయూసీ నాయకులు హెచ్చరించారు. కోశాధికారి కోడే సాయి బాలాజీ, నాయకులు రామిశెట్టి శ్రీను, గాది తాతముని, రామిశెట్టి నాగు ఆధ్వర్యంలో సంక్షేమ బోర్డుకు నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌లకు ఉత్తరాలు రాశారు. అనంతరం నిరసన ప్రదర్శన నిర్వహించారు. గొల్లగూడెం సెంటర్‌లో శనివారం జరిగిన కా ర్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో పెండింగ్‌లో ఉన్న 46 వేల క్లయిమ్స్‌ పరిష్కరించాలన్నారు. సంక్షేమ బో ర్డు హక్కులను అమలు చేసేలా చూడాలని, వృద్ధ కార్మికులకు పెన్షన్‌ మంజూరు చేయాలని, అర్హులైన లబ్ధిదారులు అప్లికేషన్లు తీసుకునేలా అధికారులు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్‌ చేశారు. కడకట్ల, కొండయ్య చెరువు, హౌసింగ్‌బోర్డు, గొల్లగూడెంనకు చెందిన కార్మికులు హాజరయ్యారు.

క్షీరారామంలో హైకోర్టు న్యాయమూర్తి పూజలు
1
1/3

క్షీరారామంలో హైకోర్టు న్యాయమూర్తి పూజలు

క్షీరారామంలో హైకోర్టు న్యాయమూర్తి పూజలు
2
2/3

క్షీరారామంలో హైకోర్టు న్యాయమూర్తి పూజలు

క్షీరారామంలో హైకోర్టు న్యాయమూర్తి పూజలు
3
3/3

క్షీరారామంలో హైకోర్టు న్యాయమూర్తి పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement