
చెక్ పవర్ రద్దుపై హైకోర్టు స్టే
పెనుగొండ: కుట్రతో రద్దు చేయించిన చెక్ పవర్ రద్దును నిలిపివేస్తూ హైకోర్టు స్టే విధించిందని పోడూరు మండలం పండిత విల్లూరు సర్పంచ్ ఇళ్ల లక్ష్మీ చంద్రిక తెలిపారు. శనివారం హైకోర్టు ఉత్తర్వులను కలెక్టరు చదలవాడ నాగరాణి, డీపీఓ రామ్‌నాథ్‌రెడ్డిలకు పోడూరు జెడ్పీటీసీ గుంటూరి పెద్దిరాజు, ఆచంట ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ గుబ్బల వీరబ్రహ్మం, వైఎస్సార్‌సీపీ నాయకుడు గెద్దాడ ఏకలవ్యలతో కలిసి అందించినట్లు తెలిపారు. ఈ పోరాటానికి సహకరించిన మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఇతరులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఏలూరు (టూటౌన్) : తన పొలం చుట్టూ సిమ్మెంట్ దిమ్మలతో ఫెన్సింగ్ వేస్తే ఇటీవల కొన్ని దిమ్మెలు అపహరణకు గురయ్యాయని దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడంలేదని దెందులూరు మండలం శ్రీరామవరం గ్రామానికి చెందిన కామిరెడ్డి వీర వెంకట సత్య సతీష్ శనివారం కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. శ్రీరామవరంలో తన పొలం అన్యాక్రాంతం కాకూడదని పొలం చుట్టూ సిమెంట్ దిమ్మెలతో ఫెన్సింగ్ వేసినట్లు తెలిపారు. ఆ సిమెంట్ దిమ్మెలు వేరే వ్యక్తి పొలంలో దర్శనమిచ్చాయని దీనిపై దెందులూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినందుకు కొందరు తనను బెదిరించి కులం పేరుతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలవరం రూరల్: శ్రీసత్య సాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్, వర్కర్స్ వేతన బకాయిలు తక్షణమే ఇవ్వాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి మొడియం నాగమణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పట్టిసం వద్ద వర్కర్స్ బకాయిల కోసం చేపట్టిన నిరసన కార్యక్రమానికి సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 11 నెలల వేతనాలు బకాయిలు ఉంటే కార్మికులు కుటుంబాలు ఎలా గడుస్తాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తక్షణమే చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం చేయాలన్నారు.
పెనుమంట్ర: డీఎస్సీ–2025 పోటీ పరీక్షల్లో పెనుమంట్ర మండలం మార్టేరుకు చెందిన వెలగల రమ్యశ్రీ టీజీటీ ఇంగ్లీష్ విభాగంలో 85.43 మార్కులతో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించింది. స్కూల్ అసిస్టెంట్ కేటగిరిలో 87.43 మార్కులతో రాష్ట్ర స్థాయి ఎనిమిదో ర్యాంకు, జిల్లా స్థాయిలో రెండో ర్యాంకు సాధించింది.
తాడేపల్లిగూడెం: నేర నియంత్రణ, త్వరితగతిన కేసులు పరిష్కారం అనే అంశంపై స్థానిక ఎకై ్సజ్ సీఐ కార్యాలయంలో డైరెక్టర్ ఆఫ్ ఎన్‌ఫోర్స్‌మెంటు ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ రాహుల్ దేవ్‌శర్మ సమీక్ష చేశారు. నేర నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యల గురించి దిశానిర్ధేశం చేశారు.
తాడేపల్లిగూడెం రూరల్ : ఒక మహిళతో సహజీవనం చేస్తున్న వ్యక్తి ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో వీడియోలు రికార్డు చేసి వాటిని సోషల్ మీడియాలో పెట్టిన ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మండలంలోని పట్టింపాలెంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తొమ్మిదేళ్ల క్రితం భర్త చనిపోయిన ఒక మహిళ, స్థానికుడైన ఆముదాలపల్లి శివశంకర్ గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో వారిద్దరూ సన్నిహితంగా ఉన్న సందర్భంలో శివశంకర్ తన ఫోనులో వీడియోలు తీసి ఆమెను బెదిరించేవాడు. ఈ క్రమంలో వారి మధ్య విభేదాలు తలెత్తడంతో విడివిడిగా జీవిస్తున్నారు. నిందితుడు శివశంకర్ నకిలీ ఇన్‌స్ట్రాగామ్ ఐడీని సృష్టించి బాధితురాలి అశ్లీల వీడియోలను సోషల్‌మీడియాలో అప్‌లోడ్ చేసి వైరల్ చేశాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చెక్ పవర్ రద్దుపై హైకోర్టు స్టే

చెక్ పవర్ రద్దుపై హైకోర్టు స్టే