
ఉత్సాహంగా యోగా పోటీలు
తాడేపల్లిగూడెం (టీఓసీ) : రాష్ట్ర స్థాయి యోగాసన స్పోర్ట్స్ చాంపియన్‌షిప్ పోటీలు మూడో రోజుకు చేరాయి. శనివారం వ్యక్తిగత, జంట పోటీలు నిర్వహించారు. వ్యక్తిగత విభాగంలో భాగంగా ట్రెడిషనల్ యోగాసన, ఫార్వర్డ్ బెండ్ ఇండివిడ్యువల్, బ్యాక్‌వర్డ్ బెండ్ ఇండివిడ్యువల్, ట్విస్టింగ్ ఇండివిడ్యువల్, ఆర్టిస్టిక్ యోగా విభాగాలలో పోటీలు నిర్వహించారు. ఐదు విభాగాలలో జరిగిన పోటీలలో మహిళలకు, పురుషులకు వేర్వేరు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో 23 జిల్లాల నుంచి యోగా సాధకులు పాల్గొన్నారు. యోగాసనాలలో ప్రతిభ కనబరిచిన 48 మందికి బంగారు, వెండి పతకాలు అందజేశారు. సెషన్స్ కోర్డు న్యాయమూర్తి షేక్ సికిందర్ బాషా చేతుల మీదుగా ప్రశంస పత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి, అక్కడనుండి ప్రపంచ స్థాయికి ఎదుగుతున్న యోగాను ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షురాలు రాధిక, సహాయ కార్యదర్శి వెంకటరమణ, కోశాధికారి మల్లికార్జున రావు, ఎగ్జిక్యుటివ్ మెంబర్, కాంపిటేషన్ మేనేజర్ కరిబండి రామకృష్ణ, నిర్వహణ డైరెక్టర్ రాఘవేంద్ర, అరా ఫౌండేషన్ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యుడు అపర్ణ ప్రసాద్, లయన్ త్రిమూర్తి, బాలగోపాల రామాంజనేయ రాజు, సుభద్ర, ద్వారంపూడి భాను ప్రసాద్, మల్లికార్జున రావు, సుజాత, నున్న నాగేశ్వరరావు, సూరిబాబు, ముత్యాల కృష్ణ, నరసింహరావు, వెంకటేశ్వర్లు, వై.వెంకటేశ్వరరావు, మురళీకృష్ణ, తిరుపతి రాయి, త్రిమూర్తులు పాల్గొన్నారు.