
కలెక్టరేట్ తరలింపు?
న్యూస్‌రీల్
గత ప్రభుత్వానికి పేరొస్తుందని..
ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవు
డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్
డిగ్రీ ప్రవేశాల విషయంలో తాత్సారం చేసి వారి భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసిన కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. 8లో u
గురువారం శ్రీ 21 శ్రీ ఆగస్టు శ్రీ 2025
సాక్షి, భీమవరం: జిల్లా కేంద్రం నుంచి కలెక్టరేట్ తరలిపోనుందా? పీ–4 పేరిట ఉండి నియోజకవర్గంలో ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? భీమవరానికి తలమానికంగా ఉన్న కలెక్టరేట్‌ను తరలించుకుపోతుంటే పట్టణానికి చెందిన కేంద్ర సహాయ మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు చూస్తూ ఊరుకుంటారా? ఈ విషయంలో వారి వైఖరి ఏ విధంగా ఉండబోతుంది? జిల్లాలోని రాజకీయ, సామాన్య వర్గాల్లో ఇప్పుడిదే హాట్ టాపిక్. పరిపాలన సౌలభ్యం, ప్రజలకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జిల్లాల పునర్విభజన చేసింది. నరసాపురం పార్లమెంట్‌లోని ఏడు నియోజకవర్గాలతో భీమవరం కేంద్రంగా 2022 ఏప్రిల్ 4న నూతన పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడింది. కలెక్టరేట్‌ను తాత్కాలికంగా స్థానిక 7వ వార్డులోని ప్రైవేట్ కళాశాల భవనంలో ఏర్పాటుచేశారు. అన్ని శాఖల జిల్లా అధికారులు ఒకే చోట ప్రజలకు అందుబాటులో ఉండేలా శాశ్వత ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం భీమవరంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) యార్డులో 20 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసింది. ఈ భూమిని మార్కెటింగ్ శాఖ నుంచి రెవెన్యూ శాఖకు భూమిని బదలాయిస్తూ 2023 మార్చి 20న జీవోను జారీచేశారు. ఈ మేరకు రెవెన్యూ రికార్డులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మార్పులు చేసి రూ.80 కోట్లతో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవన నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను పూర్తి చేశారు.
మళ్లీ తెరపైకి.. తాజాగా మళ్లీ కలెక్టరేట్‌ను తరలించుకుపోయేందుకు ప్రయత్నాలు ముమ్మరమైనట్టు రాజకీయ వర్గాలు, సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పీ–4 పేరిట ఉండి నియోజకవర్గంలో కలెక్టరేట్ నిర్మాణానికి అనుమతులివ్వాలని కూటమి నేత ఒకరు సీఎం చంద్రబాబును కలిసినట్టుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై భీమవరానికి చెందిన కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఇంకా స్పందించిన దాఖలాలు లేవు. ఈ విషయంలో వారి స్టాండ్ ఏమిటన్న చర్చ నడుస్తోంది. భీమవరంలోని ఏఎంసీ స్థలం అందరికీ అందుబాటులో ఉంటుందని, ప్రజామోదం లేకుండా కలెక్టరేట్ తరలిస్తే ఉద్యమిస్తామని సీపీఎం నేతలు ప్రకటించారు. నూతన భవనం ఎక్కడ నిర్మించేది ప్రజాప్రతినిధులు, అధికారులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొందరి ప్రయోజనాల కోసం కలెక్టరేట్ తరలింపు సరికాదంటున్నారు.
భీమవరంలో శాశ్వత భవన నిర్మాణం జరిగితే గత ప్రభుత్వానికి పేరొస్తుందనే రాజకీయ కక్షతో కూటమి నేతలు కుట్ర రాజకీయాలకు తెరలేపారన్న విమర్శలున్నాయి. ఏఎంసీలో ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణానికి గత ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఆరు నెలల క్రితమే కూటమి ప్రభుత్వం రద్దుచేస్తూ ఉత్తర్వులిచ్చింది. భవన నిర్మాణం కోసం ఉండి నియోజకవర్గం పెదఅమిరంలోని 3.5 ఎకరాల స్థలాన్ని ఉన్నతాధికారులు పరిశీలన చేశారు. జిల్లా కేంద్రం మార్పుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అప్పట్లో సోషల్ మీడియాలో దుమారమే రేగింది. కలెక్టరేట్ తరలింపు ప్రయత్నాలను అడ్డుకుంటామని వైఎస్సార్‌సీపీ, ఇతర రాజకీయ పక్షాలు స్పందించాయి.
పీ–4 పేరిట ఉండిలో ఏర్పాటుకు యత్నాలు
జిల్లా కేంద్రం నుంచి తరలిపోతుందని జోరుగా ప్రచారం
కలెక్టరేట్ భవనానికి భీమవరం ఏఎంసీలో స్థలాన్ని కేటాయించిన గత ప్రభుత్వం
రూ.80 కోట్లతో ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణానికి అప్పట్లోనే టెండర్లు
గత ప్రభుత్వానికి పేరొస్తుందని కూటమి నేతల కుట్రలు
పెదఅమిరంలో ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం ఉంది. ఈ పంచాయతీకి జువ్వలపాలెం రోడ్డు మీదుగా వెళ్లాలి. ఈ రోడ్డులో ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఉంటుంది. సాధారణ రోజుల్లోనే డా.బీఆర్ అంబేడ్కర్ సెంటర్ నుంచి ఎస్‌ఆర్‌కేఆర్ కళాశాల వరకు 3.5 కి.మీ ప్రయాణానికి దాదాపు 20 నిమిషాల సమయం పడుతుంది. కలెక్టరేట్‌తో వాహనాల రద్దీ మరింత పెరిగి సమస్య అధికమవుతుందంటున్నారు. భీమవరంలోని ఏఎంసీకి పాల కొల్లు, ఆచంట, నరసాపురం, ఉండి, తాడేపల్లిగూడెం, తణుకు నియోజకవర్గాల నుంచి రోడ్డు సదుపాయం ఉంది. ఆయా నియోజకవర్గాల వారు భీమవరం పట్టణంలోకి రావాల్సిన పనిలేకుండా నేరుగా కలెక్టరేట్‌కు చేరుకునే వీలుంటుంది. దీనివలన పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు కొంత మేర తగ్గుతాయని స్థానికులు అంటున్నారు.

కలెక్టరేట్ తరలింపు?

కలెక్టరేట్ తరలింపు?

కలెక్టరేట్ తరలింపు?