దేవదాయ శాఖ భూమి స్వాధీనం
నరసాపురం రూరల్: మండలంలోని చిట్టవరం గ్రామంలో ఆక్రమణలకు గురైన మదన గోపాల స్వామి దేవస్థానం భూమిని శనివారం దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్‌ఎస్ నెం 158–18లో భూమి ఆక్రమణకు గురయినట్లు గుర్తించిన అధికారులు దేవదాయ ధర్మాదాయ శాఖ చట్టం ప్రకారం తహసీల్దార్ ఐతం సత్యనారాయణ, నరసాపురం రూరల్ ఎస్సై సురేష్, దేవదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో స్థలాన్ని పరిశీలించారు. ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకుని గోడను నిర్మించి స్థలాన్ని దేవాలయ కార్యనిర్వహణాధికారికి స్వాధీనం చేశారు. దేవాలయ భూములు ఆక్రమించినా, స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.


