
పోలీసుల క్యూఆర్ కోడ్ ప్రారంభం
భీమవరం: గంజాయి, మాదక ద్రవ్యాలు ఇలా ఏదైనా సమాచారం పోలీసులకు తెలియజేసేందుకు క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. భీమవరం వన్‌టౌన్ స్టేషన్‌లో సోమవారం క్యూఆర్ కోడ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కోడ్‌ను స్కాన్ చేయగానే లింక్ వస్తుందని, అందులో వివరాలు చెబితే సర్వర్‌లోకి చేరతాయన్నారు. ఇలా నమోదైన వివరాలను పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి సంబంధిత స్టేషన్లకు పంపించి విచారణ చేస్తారన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతారని ఎస్పీ తెలిపారు. డీఎస్పీ ఆర్‌జీ జయసూర్య, సీఐలు ఎం. నాగరాజు, జి.కాళీచరణ్ పాల్గొన్నారు.