కార్యకర్తలకు అండగా జగన్
తణుకు అర్బన్: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పారదర్శకంగా సంక్షేమం అందించారని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అన్నారు. తణుకు సీఎం ఫంక్షన్ హాలులో గురువారం తణుకు నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమావేశాన్ని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రసాదరాజు మాట్లాడుతూ పార్టీ నాయకత్వం సంస్థాగ తంగా పార్టీని ప్రక్షాళన చేసే దిశగా వెళ్తుందన్నారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు జగన్ పదవులు అందించారని గుర్తుచేశారు. సంక్షేమాన్ని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వంపై ప్రజ ల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. కేసులకు బెదరం.. చెదరం అని స్పష్టం చేశారు.
రాలిపోయే పువ్వు కేంద్రమంత్రి వర్మ : కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ రాలిపోయే పువ్వు అని, కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి తనపై దిగజారి వ్యాఖ్యలు చేయడం తగదని మాజీ మంత్రి కారు మూరి నాగేశ్వరరావు అన్నారు. ఎంపీగా నరసాపురం ప్రాంత ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన లే కుండా చేతులు, కాళ్లు నరుకుతానని బాహాటంగా నే అనడం దౌర్భాగ్యమన్నారు. రాజుల గౌరవాన్ని పాడుచేసేలా ఆయన భాష వాడకాన్ని చూస్తుంటే వర్మ వార్డు మెంబరుకు ఎక్కువ సర్పంచ్‌కు తక్కువ అని ఎద్దేవా చేశారు. ఆయన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పశువధ శాలలో ఆవులు, గేదెలు వధిస్తున్నందుకు వర్మకు ఎన్నికోట్లు ముట్టాయోనని త ణుకు ప్రజలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. టీటీడీలో కూటమి ప్రభుత్వం వచ్చాక 45 గోవులు చనిపోతే నోరు విప్పలేకపోయావా వర్మా అని నిలదీశారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఎడిటింగ్ మాస్టర్ అని ఎద్దేవా చేశారు. ఏలూరులో తన మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో వదలడంతో రాష్ట్రవ్యాప్తంగా తానే పెరిగానని కారుమూరి అన్నారు. పావలా ఎమ్మెల్యేగా పేర్గాంచిన రాధాకృష్ణ హయా ంలో పేకాటలు, కోడి పందేలు, క్రికెట్ బెట్టింగ్‌లు, మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయని దు య్యబట్టారు. జగన్ పాలనలో అందరికీ సంక్షేమం అందించారని అన్నారు. కూటమి పాలనలో సంక్షేమం అందించకుండా విద్యార్థులను, రైతులను, మహిళలను రోడ్డున పడేసేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా కూటమి చేస్తున్న మారణకాండకు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రి వ్యాఖ్యలు దుర్మార్గం
కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ ఇటీవల మాజీ మంత్రి కారుమూరిపై చేసిన వ్యాఖ్యలు దుర్మార్గంగా ఉన్నా యని ఎస్సీ కమిషన్ మాజీ సభ్యుడు చెల్లెం ఆనంద్ ప్రకాష్, రాష్ట్ర ఎంబీసీ మాజీ చైర్మన్ పెండ్ర వీరన్న అన్నారు. అత్తిలి ఎంపీపీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు ఫ్యాక్షనిజాన్ని తలపిస్తోందన్నారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు చినిమిల్లి వెంకటరాయుడు, పార్టీ యూత్ విభాగం జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి సందీప్, బహుజన కులాల రాష్ట్ర నేతలు చింతపల్లి గురుప్రసాద్ పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ముదునూరి ప్రసాదరాజు


