పార్టీకి పూర్వ వైభవం తీసుకువద్దాం
గణపవరం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనపై నమ్మకంతో కీలకమైన పీఏసీ కమి టీ సభ్యుడిగా నియమించారని, ఆయన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, నిరంతరం పార్టీ అభివృద్ధికి పాటుపడతానని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం క్యాంపు కార్యాలయానికి వచ్చి వాసుబాబుకు అభినందనలు తెలిపారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. అనంతరం వాసుబాబు మాట్లాడుతూ పార్టీకి ప్రజల్లో అభిమానం ఏమాత్రం తగ్గలేదని, జగన్ పర్యటనలకు వెల్లువెత్తుతున్న ప్రజాదరణే ఇందుకు నిదర్శనమన్నారు. గత ఎన్నికల్లో అలవికాని హామీలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, ఏడాది తిరక్కుండానే కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. సూపర్ సిక్స్‌ను అటకెక్కించి, రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంపై చంద్రబాబు దృష్టి సారించారని, పీ4 అంటూ మాయ చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు మళ్లీ జగన్ పాలనే రావాలని కోరుకుంటున్నట్టు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజల సమస్యలపై స్పందిస్తూ వారికి అండగా నిలవడం ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్దామని వాసు బాబు అన్నారు. మండల పార్టీ కన్వీనర్‌లు దండు రాము, సంకుసత్యకుమార్, మరడ మంగారావు, రావిపాటి సత్తిబాబు, ఎంపీపీలు దండు రాము, ధ నుకొండ ఆదిలక్ష్మి, గంటా శ్రీలక్ష్మి, కనుమాల రా మయ్య, జెడ్పీటీసీ సభ్యులు దేవారపు సోమలక్ష్మి, కోడే కాశి, కె.జయలక్ష్మి, తుమ్మగుంట భవానీ, పార్టీ జిల్లా నాయకులు వెజ్జు వెంకటేశ్వరరావు, పుప్పాల గోపి, నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే వాసుబాబు పిలుపు


