పీఏసీ సభ్యులుగా చెరుకువాడ, వాసుబాబు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్‌సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా ఇద్దరు కీలక నేతలకు చోటు దక్కింది. పీఏసీ పూర్తిస్థాయిలో పునః వ్యవస్థీకరించి నూతన నియామకాలు చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో నూతన సభ్యులను పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. పశ్చిమగోదా వరి జిల్లా నుంచి మాజీ మంత్రి, ఆచంట మాజీ ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఏలూ రు జిల్లా నుంచి ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాస్‌ను నియమించారు. రాష్ట్రవ్యాప్తంగా 33 మంది ముఖ్య నేతలతో కమిటీని ప్రకటించారు.
వైఎస్సార్‌సీపీలో నియామకాలు
భీమవరం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో జిల్లాలోని పలువురు నాయకులకు స్థానం కల్పించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు స్టూడెంట్స్ వింగ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పి.సంజయ్‌బాబు, పంచాయతీరాజ్ వింగ్ రాష్ట్ర జనరల్ సెక్రటరీగా తన్నీడి వెంకట గంగాధరరావు, రాష్ట్ర కా ర్యదర్శిగా వీఎస్ సీతారామకృష్ణ, క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా జీజీ బెన్‌హర్‌ను నియమించినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ప్రకటనలో తెలిపింది.
వక్ఫ్ బిల్లు రాజ్యాంగ విరుద్ధం
భీమవరం: రాజ్యాంగ విరుద్ధంగా కేంద్రం ఆ మోదించిన వక్ఫ్ సవరణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శనివారం పట్టణంలోని ప్రకాశం చౌక్‌లో నిరసన, ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. భీమారావు మాట్లాడతూ వక్ఫ్ చట్టం దేశ ఐక్యతకు, మత స్వేచ్ఛకు తీవ్ర విఘాతమని, ప్రతిపక్షాలు సూచించిన స వరణలను పరిగణనలోకి తీసుకోకుండా చట్టా న్ని ఆమోదించడం దురదృష్టకరమన్నారు. ము స్లిం మైనార్టీ నాయకులు చాన్ బాషా, షేక్ ఆషా, అంబేడ్కర్ ఆశయ సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు కోనా జోసెఫ్, కార్యదర్శి వి.రాజు, సీపీఐ నాయకులు చెల్లబోయిన రంగారావు తదితరులు పాల్గొన్నారు.
ఏరులై పారుతున్న మద్యం
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో మద్యం సిండికేట్లకు లాభాల కోసం ఊరూవాడా బెల్టుషాపులు పెట్టుకోమని కూటమి ప్రభుత్వం అను మతి ఇచ్చినట్టుందని, దీంతో ఎకై ్సజ్ అధికారులు వాటి జోలికి వెళ్లడం లేదని కల్లు గీత కార్మి కుల సంఘం ప్రధాన కార్యదర్శి జుత్తిగ నర్సింహమూర్తి విమర్శించారు. శనివారం స్థానిక ఎకై ్స జ్ కార్యాలయం వద్ద కల్లు గీత కార్మిక సంఘం నాయకులు మోకులు ధరించి నిరసన తెలిపారు. అనంతరం ఎకై ్సజ్ సీఐ మద్దాల శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. నర్సింహమూర్తి మాట్లాడుతూ బెల్టు షాపులతో కల్లు గీత కార్మికులు వ్యాపారాలు లేక రోడ్డున పడే పరిస్థితి వచ్చిందన్నారు. బెల్టు షాపులను అరికట్టాలని, గీత కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 5 వేలు, రాష్ట్రంలో 70 వేల వరకు బెల్టుషాపులు ఉన్నాయన్నారు. గీత కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెర వేర్చాలన్నారు. సంఘ ఉపాధ్యక్షుడు బొక్కా చంటి, బొంతు శ్రీను, జక్కంశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.
పీఏసీ సభ్యులుగా చెరుకువాడ, వాసుబాబు


