భీమవరం: ఈ నె 25 నుంచి జరగనున్న ఏపీపీఎస్సీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి మొగిలి వెంకటేశ్వర్లు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని కార్యాలయంలో ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లాలో భీమవరంలోని డీఎన్‌ఆర్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్, డీఎన్‌ఆర్ కాలేజ్ అటానమస్, వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ తాడేపల్లిగూడెంలో పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులను ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య, మధ్యాహ్నాం ఒంటిగంట నుంచి 2 గంటల మధ్య మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామన్నారు. హాల్‌టిక్కెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకురావాలి చెప్పారు. పరీక్షా కేంద్రాల వద్ద తగిన పోలీసు బందోబస్తు, వైద్య శిబిరాలు, తాగునీటి సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో ఏపీపీఎస్సీ అధికారులు, రెవెన్యూ, విద్యుత్, పోలీస్, మున్సిపాలిటీ, ఆర్టీసీ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.