భీమవరం(ప్రకాశం చౌక్): స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యసాధనలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావా లని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. శనివారం కలెక్టరేట్ నుంచి జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డితో కలిసి స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధనలో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఎక్కడా ప్లాస్టిక్ వాడకూడదని, రోడ్లపై చెత్త వేయకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆలయాల వద్ద వ్యర్థాలను రీసైక్లింగ్ చేసుకునే ఏర్పాట్లు చేయాలన్నారు. ఐక్యనగర్‌లోని హౌసింగ్ కాలనీలో పార్క్‌ను రూ.30 లక్షలతో అభివృద్ధి చేసేందుకు దేవి సీ ఫుడ్స్ లిమిటెడ్ ముందుకు వచ్చిందన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతిఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలన్నారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.