భీమవరం: జిల్లాలో రబీ ధాన్యం కొనుగోలుకు వ చ్చేనెల మొదటి వారంలో కేంద్రాలను సిద్ధం చేయా లని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోళ్లు, పీజీఆర్‌ఎస్, రీసర్వే, రెవెన్యూ సదస్సులు, వెబ్ ల్యాండ్, ఏపీ సేవా సర్వీసులు తదితర అంశాలపై ఆయన సమీక్షించారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో ధాన్యం కొనుగోలుకు సిబ్బందిని ని యమించి, మూడు విడతల శిక్షణ ఇవ్వాలన్నారు. గోనె సంచులు, రవాణాకు వాహనాలు సిద్ధం చేసుకోవాలన్నారు. రైతులు రైతు సేవా కేంద్రాలకు వె ళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌లో వాట్సాప్ చా ట్‌ను ప్రభుత్వం కల్పించిందన్నారు. రైతు సేవా కేంద్రాల, మిల్లులు వద్ద ఒకే కంపెనీకి చెందిన తేమశా తం యంత్రాలు ఉండేలా చూడాలన్నారు. ధాన్యం కొనుగోలుపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలో 120 గ్రామాల్లో సర్వేను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. డీఆర్వో మొగిలి వెంకటేశ్వర్లు, సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ పాల్గొన్నారు.