విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందించాలి
భీమవరం: విద్యార్థుల్లో క్రమశిక్షణ, దేశభక్తి నైపుణ్యాలను పెంపొందించేలా గైడ్స్ ట్రైనింగు వినియోగించుకోవాలని డీఈఓ నారాయణ, ఏపీసీ శ్యామ్‌సుందర్ తెలిపారు. గైడ్ కెప్టెన్ అడ్వాన్స్, పేసీ కోర్సులకు సంబంధించి స్థానిక ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎస్ స్కూల్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో శనివారం ఆయన పా ల్గొని మాట్లాడారు. రెసిడెన్షియల్ ట్రైనింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా సెక్రటరీ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీల్లో ప్రాముఖ్యత ఉంటుందని, విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుందని తెలిపారు. హెచ్‌ఎంలు శ్రీనివాస్, ఎంఓ చంద్రశేఖర్, అడ్వాన్స్ రిసోర్స్ పర్సన్ కస్తూరి సుధాకర్ పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం మావుళ్లమ్మవారి దేవస్థానంలో హుండీల ఆదాయాన్ని శనివారం లెక్కించారు. 105 రోజులకు రూ.1,02,81,455 ఆదాయం సమకూరింది. అలాగే బంగారం 215 గ్రాములు 200 మిల్లీగ్రాములు, 360 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీ లభించినట్టు ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మీ నగేష్ తెలిపారు. జిల్లా ఎండోమెంట్ కమిషనర్ వి.హరిసూర్యప్రకాశ్ ఆధ్వర్యంలో లెక్కింపు జరిగింది. ప్రధానార్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ, భీమవరం తనిఖీదారు వి.వెంకటేశ్వరరావు, శక్తీశ్వర స్వామి దేవస్థానం ఈఓ దండు కృష్ణంరాజు, భీమేశ్వరస్వామి దేవస్థానం ఈఓ తోట శ్రీనివాస్, చిక్కాల దేవస్థానం ఈఓ కడలి సాగర్ పర్యవేక్షించారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ద్వారకాతిరుమల: గొడవ పడుతున్న తల్లి, భా ర్యకు సర్దిచెప్పలేక చెప్పలేక పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందా డు. ద్వారకాతిరుమల పోలీసులు తెలిపిన వివ రాల ప్రకారం.. మండలంలోని శరభాపురం గ్రామానికి చెందిన గుంపుల రాజశేఖర్(30) పి.కన్నాపురంలోని కోకోకోలా ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. ఈనెల 1న సాయంత్రం అతడి తల్లి, భార్యకు మధ్య గొడవ జరిగింది. ఈ స మయంలో వారిద్దరికీ సర్దిచెప్పలేక ఇంటి నుంచి బయటకు వెళ్లిన రాజశేఖర్ గ్రామంలోని గొ ప్పగుంట చెరువు వద్ద పురుగుల మందు తాగి పడిపోయాడు. అటుగా వెళ్లినవారు అపస్మారక స్థితిలో ఉన్న రాజశేఖర్‌ను హుటాహుటిన భీమడోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథ మ చికిత్స అనంతరం రాజశేఖర్ తండ్రి రాంబాబు అతడిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ రాజశేఖర్ మృతిచెందగా పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. మృతుడి తండ్రి రాంబా బు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ చెప్పారు.
కాళ్ల: దాళ్వాలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనువైన వరివంగడాల వినియోగంపై ఉండి కేవీకే శాస్త్రవేత్తలు అవగాహన కల్పించారు. శనివారం సీసలిలో జరిగిన రైతు శిక్షణా కార్యక్రమంలో సూచనలిచ్చారు. దాళ్వాలో ఎంటీయూ 1121 వేయడం వల్ల పంట కోత 130 రోజులపైనే పడుతుందని దీని వల్ల వేసవి ప్రభావం పడి బియ్యం నూక అయ్యే ప్రమాదం ఉందన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా 11 ఎంటీయూ 1121తో సంకరపరచి చిరు సంచి దశలో ఉన్న ఎంటీయు 1426 వంగడం సాగు చేయాలన్నారు. జింకు లోపం గమనించి ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలో చొప్పున ముడి జింకును నేలకు వేయాలని సూచించారు. ఎకరాకు 45 కిలోల పొటాషి యం రెండు దఫాలుగా పిచికారీ చేయాలన్నారు. శాస్త్రవేత్తలు మల్లికార్జున, విజయలక్ష్మి, మత్య శాస్త్రవేత్త శ్రీనివాస్, హర్టీకల్చర్ శాస్త్రవేత్త బిందు, వ్యవసాయాధికారి పి.రమేష్‌నాయుడు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందించాలి
విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందించాలి


