సందడిగా గోదావరి క్రీడా ఉత్సవాలు
భీమవరం: మానసిక ఒత్తిళ్లు తగ్గించుకోవడానికి, శారీరక ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి క్రీడలు దో హదపడతాయని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అ న్నారు. స్థానిక ఎస్‌ఆర్‌కేఆర్ కళాశాలలో శనివారం గోదావరి క్రీడా ఉత్సవాలు (ప్రభుత్వ ఉద్యోగుల జిల్లాస్థాయి పోటీలు)ను ఆమె క్రీడా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. శని, ఆదివారాల్లో క్రికెట్, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, చెస్, టెన్నికాయిట్, త్రో బాల్, క్యారమ్స్, షాట్‌పుట్ వంటి క్రీడాంశాల్లో 235 బృందాలు, అథ్లెటిక్స్ 56 మందితో క్రీడా పోటీలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మా ట్లాడుతూ ఉద్యోగులకు ఆటవిడుపు, శాఖల మధ్య స్నేహపూరిత వాతావరణం పెంపొందించేలా క్రీడా ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. జాయింట్ కలెక్టర్ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ మండల, డివిజన్ స్థాయిల్లో ప్రతిభ కనబర్చిన వారు జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటున్నారన్నారు. కలెక్టర్ నాగరాణి క్రికెట్ బ్యాటింగ్ చేసి, జేసీ వాలీబాల్ ఆడి స్ఫూర్తినింపారు. డీఎస్‌డీఓ క్రీడా ప్రతిజ్ఞ చేయించారు. డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, ఆర్డీఓలు కె.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, ఖతీబ్ కౌసర్ భానో, దాసి రాజు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సందడిగా గోదావరి క్రీడా ఉత్సవాలు


