ఆకివీడు : ఆకివీడు నగర పంచాయతీ ఆశీలు వేలం పాట శనివారం హోరాహోరీగా సాగింది. నగర పంచాయతీ కమిషనర్ జీ.కృష్ణమోహన్ పర్యవేక్షణలో వేలం పాట కొనసాగింది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు వేలం పాటలో పాల్గొన్నారు. డైలీ మార్కెట్ వేలం పాటను మోటుపల్లి శ్రీధర్ రూ.1,01,01,006కు దక్కించుకున్నారు. వారపు సంత ఆశీలు వసూళ్లను షేక్ అమీర్ రూ.3,30,200కు, కబేళా పాటను షేక్ చంటి సాహెబ్ రూ.35,500కు దక్కించుకున్నట్లు కమిషనర్ కృష్ణమోహన్ చెప్పారు. గత ఏడాది డైలీ మార్కెట్ వేలం పాట ధర కంటే ఈ ఏడాది రూ.20 లక్షలకు పైగా ఆదాయం లభించింది.
రూ.1.01 కోట్లకు మార్కెట్ వేలం పాట
భీమవరం(ప్రకాశం చౌక్): భీమవరం మున్సిపాలిటీ పరిధిలో 2025–2026 ఏడాదికి మార్కెట్ పన్ను వసూళ్లకు శనివారం భీమవరం మున్సిపాలిటీలో బహిరంగ వేలం నిర్వహించారు. ఈ వేలం పాటలో హెచ్చు పాటగా రూ.1,01,49,070కు యార్ర వెంకటేష్ పాడుకున్నారు. గతేడాది వేలంలో రూ.95.68 లక్షలు రాగా.. ఈ ఏడాది రూ.5.42 లక్షల ఆదాయం పెరిగింది. వేలం పాటను అసిస్టెంట్ కమిషనర్ కె.వెంకటేశ్వరరావు నిర్వహించారు.