
●ఆడుకుంటానని.. వెళ్లిపోయావా అన్నయ్యా!
ఆడుకుంటానని వెళ్లి.. అనంతలోకాలకు వెళ్లిపోయావా.. అన్నయ్యా? అంటూ చెల్లెలు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. మండలంలోని చినకాపవరం గ్రామంలో ఓల్డ్ వయ్యేరు పంట కాలువలోకి శుక్రవారం స్నానం చేసేందుకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు శరత్ కుమార్, పవన్ సాయి మృత్యువాత పడ్డారు. అయితే విగతజీవిగా పడి ఉన్న అన్న మృతదేహాన్ని చూసిన చెల్లెలు తోడు లేకుండా వెళ్లిపోయావా? అన్నయ్యా అంటూ రోదించింది. పదేళ్ల వయస్సులోనే ఇద్దరు బాలురు మృతి చెందడంతో చినకాపవరం, పెదకాపవరం గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
– ఆకివీడు