
భీమవరం: భీమవరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీవో కే శ్రీనివాసులురాజు తెలిపారు. గురువారం తన చాంబర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్ధి నేరుగా గాని ప్రతిపాదనతోగానీ నేటి నుంచి 25వ తేదీ గురువారం వరకు నామినేషన్లు దాఖలు చేయకోవచ్చునని అన్నారు. ప్రభుత్వ సెలవు రోజుల్లో కాకుండా ఏరోజైనా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు భీమవరం మున్సిపల్ ఆఫీస్ ప్రాంగణంలోని ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి, తహసీల్దార్‌కు గానీ నామినేషన్లు అందించవచ్చన్నారు. ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ల పత్రాలను పొందవచ్చునని, ఈనెల 26న ఉదయం 11 గంటల నుంచి రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, ఏదైనా అభ్యర్ధి నామినేషన్ ఉపసంహరణ సందర్భంలో ఫారం–5 ద్వారా అభ్యర్ధి రాత పూర్వకంగా ఉపసంహరించుకోవచ్చునని, అనంతరం అభ్యర్థులకు గుర్తులు కేటాయించడం జరుగుతుందన్నారు. మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని తెలిపారు.
25 వరకు నామినేషన్ల స్వీకరణ, 26న నామినేషన్ల పరిశీలన, 29న ఉపసంహరణ
ఆర్డీవో శ్రీనివాసులు రాజు