పోటీతత్వంతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

పోటీతత్వంతో పనిచేయాలి

Sep 22 2023 12:40 AM | Updated on Sep 22 2023 12:40 AM

భీమవరం (ప్రకాశంచౌక్‌): లక్ష్యసాధనలో పోటీతత్వంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జవహర్‌రెడ్డి సూచించారు. గురువారం విజయవాడ సచివాలయం నుంచి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుపై కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. భీమవరం కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ పి.ప్రశాంతి, జాయింట్‌ కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి హాజరయ్యారు. విద్యా, వైద్యం, సీ్త్ర శిశు సంక్షేమంలో సాధించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, విద్యాశాఖలో ప్రగతి, వ్యవసాయ శాఖలో ఈకేవైసీ నమోదు, జగనన్న లేఅవుట్‌లో గృహ నిర్మాణాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, స్పందన ఫిర్యాదులు, గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పెండింగ్‌లో ఉన్న పనులు, జగనన్నకు చెబుదాం కార్యక్రమంపై ఆయన సమీక్షించారు. రాష్ట్రంలో గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియోలో 7,535 సచివాలయాలు వంద శాతం సాధించాయని, మిగిలిన సచివాలయాల్లో కూడా ఈ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. మనబడి నాడు–నేడు పనులకు నిధుల కొరత లేదని, అదనపు తరగతి గదుల నిర్మాణం వెంటనే పూర్తిచేయాలన్నారు. జగనన్న గోరుముద్ద కింద పాఠశాలలకు కొత్తగా వంట పాత్రలు సరఫరా చేస్తున్నామన్నారు. నెలాఖరులోపు పీఎం కిసాన్‌ రైతుల ఈకేవైసీ పూర్తిచేయాలన్నారు. వచ్చేనెలలో జగనన్న ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించే అవకాశం ఉన్నందున పెండింగ్‌ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న బిల్లులను పూర్తి చేయాలన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష అమలుపై ప్రజలకు మెరుగైన అవగాహన కల్పించేలా వలంటీర్లకు శిక్షణ ఇవ్వాలన్నారు. జిల్లాల వారీగా బాల్య వివాహాలు ఎక్కువగా జరిగే హాట్‌స్పాట్‌లను గుర్తించి, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. డీఎల్‌డీఓ అప్పారావు, డీఈఓ ఆర్‌.వెంకటరమణ, డీఎంహెచ్‌ఓ డి.మహేశ్వరరావు, హౌసింగ్‌ పీడీ ఆర్‌సీ ఆనందకుమార్‌ పాల్గొన్నారు.

కలెక్టర్లకు సీఎస్‌ దిశానిర్దేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement