పరకాల: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని, సమయపాలన పాటించి ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మున్సిపల్ అధికారులు, ఉద్యోగులను ఆదేశించారు. ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి పరకాల మున్సిపల్ కార్యాలయాన్ని మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలో అధికారులు, ఉద్యోగుల చాంబర్లు, హాజరు, పనితీరును క్షణ్ణంగా పరిశీలించారు. విధులకు హాజరుకాని అధికారులు, సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయా ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కమిషనర్ పవన్‌ను ఆదేశించారు. కార్యాలయానికి కొత్తగా వచ్చిన మేనేజర్‌కు ఎలాంటి బాధ్యతలు ఇవ్వకుండా ఖాళీగా ఉంచడం ఏంటని కమిషనర్‌ను ప్రశ్నించారు. మున్సిపల్ కార్యాలయానికి వచ్చే ప్రతి దరఖాస్తును సకాలంలో పరిష్కరించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. పట్టణాభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధిదీపాలు, రోడ్ల నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. పరకాల మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్‌కుమార్, మేనేజర్ రజిత, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
మున్సిపల్ కార్యాలయం ఆకస్మిక తనిఖీ


